జగన్… ఏపీ ముఖ్యమంత్రి అవడంతోనే ఎన్నో విమర్శలు వచ్చాయి. అనేక కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అవుతారు.. అంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. అనుభవం లేదు.. రాజకీయాలు తెలియవు.. ఎలా రాష్ట్రాన్ని పాలిస్తారు జగన్ అంటూ అందరూ పెదవి విరిచారు. కానీ.. ఎవరు ఏమనుకున్నా.. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయాలను జగన్ తీసుకున్నారు. ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు చేయలేని, చేయని పనులను కూడా చేసి సూపర్ అనిపించుకున్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సీఎం జగన్ అమలు చేసినటువంటి పథకాలు లేవు. అవన్నీ ఆయన ఆలోచనలే. సరికొత్త పథకాలతో మొత్తం దేశం దృష్టినే ఆయన ఆకర్షించారు. ఇలా… ఎదురు లేకుండా.. ఎన్నో ఉత్తమమైన నిర్ణయాలు తీసుకున్న జగన్ .. ఓ విషయంలో తీసుకున్ని నిర్ణయంతో లేనిపోని చిక్కు వచ్చి పడిందట.
అదే ట్రాఫిక్ రూల్స్ విషయంలో తీసుకున్న నిర్ణయం. ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదంటూ… వాహనదారులపై భారీ ఫైన్లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అసలే కరోనా కాలం. బయట ఉద్యోగాలు లేవు. రూపాయి పని లేదు. చేతుల్లో చిల్లిగవ్వ లేదు. ఇటువంటి సమయంలో ఇలా ప్రజల జేబుల్లోంచి డబ్బులు లాక్కోవడం సమంజసమా? అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
అసలు.. ముందు సరైన రోడ్లు లేవు… సరైన సిగ్నలింగ్ వ్యవస్థ లేదు కానీ.. ఫైన్లు మాత్రం భారీగా గుంజుతున్నారు. ఇది అస్సలు కరెక్ట్ కాదని ప్రజలతో పాటు.. ప్రతిపక్షాలు కూడా సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి..