Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి చెందగా..?

Road Accident: ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల ఎక్కడి ప్రజలు అక్కడ స్తంభించిపోవడంతో, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గింది. అయితే ఆ తరువాత కరోనా తగ్గుముఖం పట్టడంతో కొన్ని సడలింపులు చేసిన తరువాత వాహనాలు మరి తిరుగుతుండడంతో, కథ మళ్లీ మొదటికి వచ్చింది. రోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు కి అసలు కారణం నిర్లక్ష్యం, అతివేగం.

రోజు ఇలాంటి జరుగుతూనే ఉన్నా కూడా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. అతి వేగంగా వెళ్లడం వల్ల వారితో పాటు వారితో ఉన్న మనుషుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. అలాగా కర్నూలు జిల్లా బల్మూరు మండలం పరిధిలోని వీర రామాజిపల్లి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను డీసీఎం వాహనం ఎదురుగా ఢీ కొట్టింది. దీనితో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల కూర్చున్న మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఇక స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అచ్చంపేట కు చెందిన సందీప్ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. మరొక వ్యక్తి ఫిరోజ్ అని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై బల్మూరు మండలంలోని పర్యటిస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండల కేంద్రానికి వెళుతుండగా జరిగిన ప్రమాద స్థలాన్ని సందర్శించారు. వెంటనే వైద్య సదుపాయాలు అందించే చర్యలు తీసుకోవాలి అని సూచించారు.