రహానేకి రెండోసారి ఆ అరుదైన గౌరవం .. ఏంటంటే ?

అజింక్య రహానే .. టీం ఇండియా తాత్కాలిక కెప్టెన్. ఆస్ట్రేలియాలో పలు రికార్డ్స బద్దలు కొట్టాడు. మొదటి టెస్ట్ లో ఘోర పరాజయం , ఆ పై విరాట్ కోహ్లీ , మహమ్మద్ షమీ లాంటి అగ్రశేణి బ్యాట్ మెన్స్ జట్టుకి దూరమైనా కూడా రెండో టెస్టులో కుర్రాళ్లకి మద్దతుగా నిలిచి , వారిని ఉత్సహ పరుస్తూ ఇండియా కి అద్భుత విజయాన్ని అందించాడు.

India vs Australia: Ajinkya Rahane finally breaks silence on Rohit Sharma's  inclusion in playing XI | Cricket News | Zee News

ఈ క్రమంలోనే రహానే మరో ఘనత సాధించాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలోని ‘హానర్స్ బోర్డు’లో దిగ్గజాల సరసన రహానే చోటు దక్కించుకున్నాడు.ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో 112 పరుగులతో చెలరేగిన రహానే భారత్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించినందుకు అతనికి ఈ గౌరవం దక్కింది.

ఎంసీజీ హానర్స్‌ బోర్డులో రహానే పేరు చేర్చడం ఇది రెండోసారి కావడం విశేషం. ప్రతిష్టాత్మక హానర్స్‌ బోర్దులో ఆస్ట్రేలియా గ్రౌండ్‌ సిబ్బంది తన పేరును చెక్కే వీడియో క్లిప్‌ను బీసీసీఐ ట్విటర్లో షేర్‌ చేసింది. 2014లో తొలిసారి రహానే పేరును హానర్స్‌ బోర్డులో చేర్చారు. ఎంసీజీలో డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్‌లో రహానే 147 రన్స్‌ చేశాడు. పర్యాటక జట్లకు చెందిన ఆటగాళ్లు టెస్టు సెంచరీ లేదా కనీసం ఐదు వికెట్లు తీసిన వారి పేర్లను హానర్స్‌ బోర్డులో చేర్చుతారు.