టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ భారత్‌కు తొలి పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకం గెలిచారు. 49 కేజీల కేటగిరీలో ఆమె ఈ పతకాన్ని గెలిచారు. చైనాకు చెందిన ఝీహు హూ స్వర్ణం గెలుచుకోగా, ఇండోనేషియాకు చెందిన విండీ ఆషా కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. మీరాబాయి చానూ 2016లో రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం పోటీ పడినప్పటికీ.. ఫెయిల్ అయ్యింది. తిరిగి పుంజుకుని 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి… రెండు దశాబ్దాల తర్వాత ఆ ఫీట్‌ను సాధించిన ఇండియన్ వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచింది.
రజత పతకాన్ని ముద్దాడిన మీరాబాయి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ట్విట్టర్ లో స్పందించిన మీరాబాయి… నా కల నిజమైంది. ఈ మెడల్ని నా దేశానికి అంకితం ఇస్తున్నాను అలానే ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉండి నా గెలుపు కోసం ప్రార్థించిన కోట్లాది భారతీయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను నమ్మి, నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా కుటుంబానికి, ముఖ్యంగా మా అమ్మకి శతకోటి వందనాలు. నాకు అండగా, సపోర్ట్ చేసిన భారత ప్రభుత్వం, క్రీడా శాఖ, స్పోర్ట్స్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్, వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, రైల్వేస్, స్పాన్సర్లు, ఓజీక్యూ, మార్కెటింగ్ ఎజెన్సీలకు కృతజ్ఞతలు. నా కోచ్ విజయ్ శర్మకు, సపోర్టింగ్ స్టాఫ్‌కి స్పెషల్ థ్యాంక్స్… నన్ను ప్రోత్సహించి, నాలో స్ఫూర్తినింపిన ప్రతీ ఒక్కరికీ వందనాలు… జై హింద్’ అంటూ ముగించింది.
I am really happy on winning silver medal in #Tokyo2020 for my country 🇮🇳 pic.twitter.com/gPtdhpA28z
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 24, 2021