Madhavan : కొడుకు చేసిన పనికి ఆనందంలో మాధవన్… దేశాన్ని గర్వపడేలా చేశావంటూ పోస్ట్…!

Madhavan : మాధవన్ అనగానే అమ్మాయిల కలల రాకుమారుడిగానే చెప్పాలి.తమిళ హీరో అయిన రన్, చెలి, సఖి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఇక చెలి, సఖి సినిమాలతో అమ్మాయిల మనసు దోచేసాడు. ఇప్పటికి ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా అలరిస్తున్న మాధవన్ ఇప్పటికి అమ్మాయిలకు ఫేవరెట్టే.

రొమాంటిక్ హీరోల లిస్టులో ముందుండే మాధవన్ సినిమా కెరీర్ లో ఎన్నో విజయాలను చూసారు. కానీ ఇపుడు తన కొడుకు విజయానికి ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్ మాధవన్ స్విమ్మర్. ఇక కోపెన్ హాగ్ లోని దానిష్ లో జరిగిన డానిష్ ఓపెన్ 2022 పోటీల్లో 1500 మీ ఫ్రీ స్టైల్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. వేదాంత్ కు సిల్వర్ మెడల్‌ను ప్రకటిస్తున్న వీడియోను ఇంస్టాగ్రామ్ షేర్ చేశాడు మాధవన్‌. తన కొడుకు భారతదేశం గర్వించేలా చేశాడని సంతోషంలో తేలిపోతున్నాడు .

ఇక తన పోస్ట్ లో మాధవన్ ఇలా రాసుకొచ్చారు, దానిష్ ఓపెన్ లో భారత్ తరుపున సిల్వర్ మెడల్ సాధించిన వేదాంత్ మాధవన్ మమ్మల్ని అందరిని గర్వపడేలా చేసాడు.ప్రదీప్ సార్‌, అన్సాద్‌కు ధన్యవాదాలు. మీ అందరి కృషి ఫలించింది. మేమంతా చాలా గర్విస్తున్నాం అని సందేశాన్ని రాశాడు మాధవన్. ఇక దేశాన్ని మరోసారి గర్వంగా తలెత్తుకునేలా చేసిన యువ చాంపియన్ వేదాంత్‌కు బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, నమ్రతా శిరోద్కర్ తోపాటు పలువురు సెలబ్రిటీలు నెటిజన్లు, ఫాలోవర్లు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.