గ్రేటర్ పోరు : ఆ డివిజన్ లో మొదలైన రీపోలింగ్ …

ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలో గురువారం ఉదయం రీపోలింగ్ మరోసారి ప్రారంభమైంది. గుర్తులు తారుమారైన నేపథ్యంలో ఓల్డ్ మలక్‌పేట డివిజన్ లోని 69 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.

రీపోలింగ్ దృష్ట్యా అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు.

ఇకపోతే , ఓల్డ్ మలక్‌పేట డివిజన్ లో మొత్తం ఓటర్లు 54,655 మంది కాగా..అందులో పురుషులు 27889, స్త్రీలు 26763, ఇతరులు 3 తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రీపోలింగ్ కోసం అధికారులు 69 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అలాగే 12 మంది మైక్రో అబ్జర్వర్‌‌లను నియమించారు. దాదాపు 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు.

ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తంగా 46.60 శాతం పోలింగ్ నమోదైంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం ఓట్లు పోలయ్యాయి. గతం కంటే ఈసారి కాస్త ఎక్కువ పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.31 శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. ఇక 2009లో 42.04 శాతం పోలింగ్ రికార్డయింది