ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ

నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ఆలీ, మధు నందన్ తదితరులు.

దర్శకత్వం : శ్రీ కార్తీక్

నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు

సంగీత దర్శకుడు: జెక్స్ బిజోయ్

ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో శర్వానంద్ కి ఒక ప్రత్యేకమైన శైలి. కమర్షియల్ సినిమాల్లో కూడా ఏదో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాలు ఎంచుకుంటాడు. అయితే గత కొన్నాళ్ళనుండి సరైన హిట్ లేని శర్వానంద్ ఈ సారి ఇంకో ఫీల్ గుడ్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కొంచెం గ్యాప్ తర్వాత అక్కినేని అమల కూడా నటించారు. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ :

ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), చైతు (ప్రియదర్శి) ముగ్గురు బాల్య మిత్రులు. అయితే, ఈ ముగ్గురు పెద్దయ్యాక వాళ్ళ జీవితాల్లో తీవ్ర అసంతృప్తితో బాధ పడుతూ ఉంటారు. ఇలాంటి నిరాశ, నిర్శ్ప్రుశ లో ఉన్న సమయంలోనే వీరి జీవితాల్లోకి అనుకోకుండా ఒక సైంటిస్ట్ (నాజర్) వస్తాడు. అతను కనిపెట్టిన టైమ్ మిషన్ తో ఈ ముగ్గురు తమ గతంలోకి వెళ్లి, తమ ప్రస్తుతం సమస్యలను అలాగే భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటారు. కానీ ఆది మాత్రం ఇద్దరి లా కాకుండా చనిపోయిన తన తల్లి (అమల) ప్రాణాలు కాపాడాలని బలంగా కోరుకుంటాడు. ఈ క్రమంలో వీరు గతంలోకి ఎలా వెళ్లారు ?, వెళ్ళాక వీరి జర్నీ ఎలా సాగింది ?, చివరకు వీరి జీవితాలు ఎలా టర్న్ అయ్యాయి ?, అసలు ఇంతకీ వీళ్ళు అనుకున్నది సాధించారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఎమోషనల్‌ సాగిన ఈ మూవీ లో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అమ్మ ప్రేమకు సంబంధించి వచ్చే సన్నివేశాలు కన్నీళ్ల్లు తెప్పిస్తాయి . సెంటిమెంట్‌, ఎమోషనలే కాకుండా, నావెల్టీ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. అన్నిటికీ కంటే ముఖ్యంగా తెలుగు సినిమాకు ఈ పాయింట్‌ చాలా ఫ్రెష్ మరియు కొత్తగా ఉంది.

మైనస్ పాయింట్స్ :

శర్వానంద్ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డైజైన్ చేసుకున్న దర్శకుడు అదే స్థాయిలో సెకండ్ హాఫ్ ను రాసుకోలేదు. కొన్ని సీన్స్ లాజిక్ కి అందవు.

నిజానికి సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపినా.. కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగాయి.

తీర్పు :

చాలా కాలం తర్వాత శర్వానం ఒక మంచి సినిమా తో వచ్చాడు. మంచి సినిమాలు చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా తప్పక నచుతుంది.