అల్లరి నరేష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

‘అల్ల్లరి’ సినిమాతో తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన నరేష్, ఒకప్పుడు మినిమం గారంటీ హీరోగా మంచి పేరు తీసుకున్నాడు. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు తీసి దాదాపు అన్ని సినిమాలతో హిట్స్ కొట్టేవాడు. కానీ టీవీ లో కామెడీ షోస్ ఎక్కువ అవ్వడం, పైగా స్టార్ హీరోస్ కూడా కామెడీ చెయ్యడంతో అల్లరి నరేష్ సినిమాలు రొటీన్ అయిపోయాయి.

చాన్నాళ్లు హిట్స్ లేక కొంచెం గ్యాప్ తీసుకున్న నరేష్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు. ఆ తర్వాత ‘నాంది’ లాంటి సీరియస్ సినిమాతో మరోసారి మెప్పించాడు. ఇప్పుడు మెల్లగా కామెడీ రోల్స్ నుండి సీరియస్ పాత్రలవైపు నరేష్ వెళ్తున్నట్టు తెలుస్తుంది.

ఈసారి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో ప్రభుత్వ అధికారి పాత్రను ట్రయ్ చేస్తున్నారు.  గిరిజన ప్రాంతంలో ఎన్నికల అధికారికి ఎదురైన సమస్యలు, పరిష్కారం ఇలాంటివి డిస్కస్ చేసినట్లు కనిపిస్తోంది. అసలు మారేడుమిల్లి ప్రజలు ఏమని విన్నవించుకున్నారు. అక్కడేం జరిగింది అన్నది స్టోరీ.

ఎఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ని నవంబర్ 11  రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.