మూవీ రివ్యూ : కృష్ణ వ్రిందా విహారి

నటినటులు: నాగశౌర్య, షిర్లే సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు.

డైరెక్టర్: అనీష్ ఆర్ కృష్ణ

నిర్మాతలు: ఉషా మూల్పూరి

మ్యూజిక్ డైరెక్టర్ : మహతి స్వర సాగర్

టాలెంట్ తో పాటు మంచి అందం ఉన్న నటుడు నాగ శౌర్య. కానీ చాలా కాలం నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెరీర్ మొదట్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచుతానంద’, ఆ తర్వాత ‘చలో’ సినిమాల్తో హిట్ అందుకున్నా కానీ ఈ మధ్య కెరీర్ డీలా పడింది. కొంచెం గ్యాప్ తర్వాత ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాతో తన లక్ చెక్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చాడు నాగ శౌర్య. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ:

కృష్ణ  (నాగశౌర్య) బ్రాహ్మణ కులానికి  ఒక సాంప్రదాయ కుర్రాడు. తను పనిచేసే ఆఫీసులో నార్త్ కి చెందిన అమ్మాయి వ్రింద (షిర్లే సెటియా) తో కృష్ణ ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు కృష్ణ. ఎలాగైతే తనను ప్రేమలో పడేసి పెళ్ళికి ఒప్పిస్తాడు. తర్వాత ఇద్దరికీ పెళ్లి కూడా అవుతుంది. అయితే ఇండివిడ్యువాలిటీ ఎక్కువగా ఉన్న తన వైఫ్, అలాగే ఆర్థోడాక్స్ ఫామిలీ లో ఇమడగలిగిందా, పెళ్లి తర్వాత వీళ్లిద్దరు ఎదుర్కొన్న సమస్యలు  ఏంటి.. వారి కుటుంబ సభ్యులు వీరి వివాహానికి ఎలా స్పందిస్తారు.. పైగా ఇద్దరి అభిరుచులు వేరున్న కృష్ణ, వ్రింద ఎలా మెలుగుతారు  అనేది మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్:

ఎలాంటి రోల్ అయినా మెప్పించే  నాగశౌర్య, బ్రాహ్మణుడి కుర్రాడుగా ఇంకోసారి ఇంప్రెస్స్ చేసాడు. తన లుక్స్ బాగా ఈ మూవీ ప్లస్ఇ అయ్యాయి. మ్యూజిక్ పరవాలేదు అన్నట్టుగా ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్బా గానే ఉన్నాయి. కామెడీ అంత సూపర్ కాకపోయినా…పర్వాలేదు.

మైనస్ పాయింట్స్:

డైరెక్టర్ కథ విషయంలో కాస్త జాగ్రత్తపడేది ఉంటే బాగుండేది. ఈ సినిమాకు నాని ‘అంటే సుందరిని’ సినిమాకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఎడిటింగ్ అంతగా బాలేదు. అలాగే టెక్నికల్ విలువలు కూడా అంతగా బాలేవు.

ఒక్క మాటలో చెప్పాలంటే….ఈ సినిమా ప్రేక్షకులని నిరాశపరుస్తుంది.