సలార్ అధికారక ట్విట్టర్ హ్యాండిల్ ప్రారంభించిన మేకర్స్.. ఇకపై అన్ని ఇందులోనే?

కే జి ఎఫ్ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటోంది. కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటోంది.

ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు సినీ మేకర్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇకపై ఈ సినిమాకు సంబంధించిన విషయాలన్నింటినీ వెల్లడించడం కోసం చిత్రబృందం అధికారిక ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశారు.  ‘Salaar the saga’ పేరుతో ఉన్న ఈ  ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ విడుదల చేయనున్నారు.

 

ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొదటిసారిగా శృతిహాసన్ పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్నారు. కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాహో రాధేశ్యామ్ వంటి వరుసచిత్రాలు అభిమానులను నిరాశపరిచిన అప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ద్వారా అయినా ప్రభాస్ తన అభిమానులను సందడి చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.