నూత‌న్ నాయుడు బాధితుడి జీవితాన్నే మార్చేసిన జ‌గ‌న్

Another blame on ap cm ys jagan mohan reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి `బిగ్ బాస్` ఫేం నూత‌న్ నాయుడు బాధితుడు, ద‌ళితుడు శ్రీకాంత్ జీవితాన్నే మార్చేసారు. ఘ‌ట‌న చోటుచేసుకున్న కొన్ని ఘంట‌ల్లోనే శ్రీకాంత్ లైఫ్ నే ట‌ర్న్ అయిపోయింది. అవును ఇప్పుడు శ్రీకాంత్ ఇంట్లో ప‌నిమ‌నిషి కాదు. ఏపీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయి. సొంత ఇల్లు..ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు అర్ధిక స‌హాయం అందింది. ఈ వెసులు బాటులు అన్ని క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు మంత్రి అవంతి శ్రీనివాస‌రావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమ‌ర‌నాథ్, పెందుర్తి ఎమ్మెల్యే అదిప్ రాజు శ్రీకాంత్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు.

avanthi srinivas
avanthi srinivas

అత‌ని ఆర్ధిక ప‌రిస్థితులు అడిగి తెలుసుకుని వెంట‌నే ప్ర‌భుత్వం తాము చేయాల‌నుకున్న‌ది చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. పెందుర్తి ఎమ్మెల్యే వ్య‌క్తిగ‌తంగా 50 వేలు ఆర్ధిక స‌హాయం చేసారు. ఈ చ‌ర్య‌ల‌కు పాల్పడిన ఎవ్వ‌ర్నీ విడిచిపెట్ట‌మ‌ని..వెనుక ఎంత‌టి వారున్నా! అరెస్ట్ చేయిస్తామ‌ని మంత్రి తెలిపారు. ఇప్ప‌టికే 7 గురిని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అయితే రాష్ర్టంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు కొత్తేం కాదు. ఇటీవ‌లే తూర్పు గోదావ‌రి జిల్లా సీతాన‌గ‌రంకి చెందిన వ‌ర ప్ర‌సాద్ అనే యువ‌కుడికి కూడా వైసీపీ నేత ఒక‌రు శ్రీకాంత్ కి లానే శిరోముండ‌నం చేసి అవ‌మానించారు. దానిపై ఇంకా కేసు న‌డుస్తోంది.

అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో మ‌రో ద‌ళితుడికి ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. నేత‌ల్ని అరెస్ట్ చేయ‌డం జ‌రిగింది. కానీ ఇలా ప్ర‌భుత్వ ప్రోత్సాహకాలైతే అందించ‌లేదు. ఇంత మంది రాజ‌కీయ‌కులు స్పందించ‌లేదు. ఇన్ని పార్టీలు తెర‌పైకి రాలేదు. కానీ శ్రీకాంత్ విష‌యంలో రాజ‌కీయ పార్టీలొచ్చాయి. పార్టీ లో మంత్రులు, ఎమ్మెల్యేలు బ‌య‌టకొచ్చి ప‌రామ‌ర్శించారు. దీంతో ఈ ఘ‌ట‌న వెనుక మ‌రో కోణం కూడా ఉంద‌న్న అనుమానాలు క్ర‌మంగా  బ‌ల‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే నూత‌న్ నాయుడు  రెండు పార్టీల‌తో స‌న్నిహితంగా ఉన్న‌ట్లు తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.