క్రేజీ అప్‌డేట్: ఎన్టీఆర్ నెక్స్‌ట్ మూవీ ఏంటో తెలుసా.?

Ntrs Pan India Movie On The Way | Telugu Rajyam

బాలీవుడ్‌లో భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దృష్టి మన టాలీవుడ్ హీరో యంగ్ టైగర్‌పై పడిందంటూ ఓ వార్త గతంలో తెగ హల్‌చల్ చేసింది. ఎన్టీఆర్ కోసం సంజయ్ లీలా భన్సాలీ ఓ ప్యాన్ ఇండియా మూవీ రెడీ చేస్తున్నాడనేది ఆ వార్త సారాంశం.

వావ్.. ఈ వార్త నిజమే అయితే, అదో పెద్ద సంచలనమే. కానీ, అది ఉత్త గాలి వార్తగానే మరుగున పడిపోయింది. కానీ, తాజాగా మరోసారి ఇదే వార్త తెరపైకి వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ ఆల్రెడీ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గెటప్పూ, సెటప్పూ అన్నీ మార్చేశాడు.

ఈ సినిమాలోని ఎన్టీఆర్ గెటప్‌కి ఇంప్రెస్ అయిన సంజయ్ లీలా భన్సాలీ అప్పుడెప్పుడో హల్ చల్ చేసిన గాసిప్పుకు ప్రాణం పోయాలనుకుంటున్నాడట. అందుకు రంగం కూడా సిద్ధం చేసేశాడనీ, త్వరలోనే ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ ఓకే చేసుకునేలా ఉన్నాడనీ, తాజాగా ప్రచారం జోరందుకుంది.

అంతేకాదు, ఈ కాంబినేషన్ మూవీకి టైటిల్ కూడా పెట్టేశారండోయ్. వావ్.. వాట్ ఏ స్పీడ్ కదా మన నెటిజన్లు. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా.? ‘జై బావ్ రే’. పోలా అదిరిపోలా.! చూద్దాం.. ఈ సారైనా ఈ గాసిప్ నిజమవుతుందేమో.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles