ఎన్టీఆర్ కూడ ఓ దారి వెతుక్కున్నాడు

NTR, Trivikram
NTR, Trivikram
 
రాజమౌళి సినిమాకు సైన్ చేస్తే ఏ హీరో అయినా కనీసం ఏడాది బిజీ అయిపోవాల్సిందే.  జక్కన్న సినిమా పూర్తయ్యేవరకు వేరొకరితో సినిమా చేయడానికి ఉండదు. అంతేకాదు రాజమౌళి డైరెక్షన్లో నటించాక ఎవరితో చేయాలనేది కూడ హీరోలకు పెద్ద సమస్యే. రాజమౌళి హీరోలంతా ఈ సమస్యను ఎదుర్కుకొన్నవారే. ఆ సమస్య వల్లనే జక్కన్న సినిమా తర్వాత అందులోని హీరోల కెరీర్ కొన్నాళ్లు నెమ్మదిస్తుంది. అయితే ఈసారి ఈ సమస్యను చాలా త్వరగానే అధిగమించారు రామ్ చరణ్, ఎన్టీఆర్.  ఇద్దరూ గతంలో రాజమౌళితో కలిసి పనిచేసినవారే. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ ముగింపు దశకు చేరుకోగానే తరవాత ప్రాజెక్ట్స్ కోసం దర్శకులను సెట్ చేసి పెట్టేసుకున్నారు. 
 
రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను ఓకే చేసుకోగా ఎన్టీఆర్ కూడ అదే పనిలో ఉన్నారు.  ఆయన కూడ త్రివిక్రమ్ కు ఫిక్స్ అయ్యారట.  గతంలో వీరి కాంబినేషన్లో ‘అరవింద సమేత’ లాంటి హిట్ మూవీ వచ్చింది. మళ్లీ అదే రిపీట్ చేయాలని అనుకుంటున్నారు ఎన్టీఆర్.
 
ఈ ఉగాదికి వీరి సినిమా లాంఛ్ అవుతుందని అంటున్నారు. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. తారక్ జాబితాలో ప్రశాంత్ నీల్ ఉన్నప్పటికీ ఆయన ‘సలార్’ పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది.