తెలుగుదేశం పార్టీలో ఎన్టీయార్ ప్రకంపనలు.!

ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీలోనే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కానీ, పార్టీలో అంతర్గత ప్రకంపనల్ని ఎలా చల్లార్చాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు. లక్ష్మీపార్వతి ఇప్పటికే ఈ విషయంపై స్పందించారు. సో, ఇక వైసీపీలో వివాదం చల్లారినట్లే.!

మరి, తెలుగుదేశం పార్టీ సంగతేంటి.? నిజానికి, ఈ విషయాన్ని మేగ్జిమమ్ క్యాష్ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ భావించింది. ఈ మేరకు చాలా చాలా కష్టపడింది కూడా. కానీ, ఏం లాభం.? ఈ గొడవ వల్ల తెలుగుదేశం పార్టీకి అదనంగా వచ్చిన మైలేజ్ ఏమాత్రం లేదు. కాకపోతే, వైసీపీకి కొంత డ్యామేజ్ జరిగింది ఏపీ ప్రజానీకంలో. అదైతే వాస్తవం.

వైసీపీకి జరిగిన డ్యామేజ్ ఎంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, టీడీపీకి ఎంతో కొంత లాభం కలగాలి కదా.? ఆ లాభం జరగలేదన్న చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. ‘ఈ విషయం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..’ అంటూ సీనియర్లు సూచించినా, చంద్రబాబు లైట్ తీసుకున్నారట.. వారి సూచనని పెడ చెవిన పెట్టారట.

ఆనాటి ఆ వెన్నుపోటు వ్యవహారాలు తెరపైకి రావడమే కాగు, అనవసరంగా టీడీపీలో జూనియర్ ఎన్టీయార్ గొడవ పెరిగిపోయిందన్న అభిప్రాయం టీడీపీ సీనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది. ‘మన పార్టీని మనమే నాశనం చేసుకుంటున్నాం..’ అని ఓ సీనియర్ నేత, చంద్రబాబుకి విడమర్చి చెప్పే ప్రయత్నం చేశారట తాజాగా. కానీ, చంద్రబాబు ఆయన వాదనని పట్టించుకోలేదని తెలుస్తోంది.

యంగ్ టైగర్ మీద బురదచల్లే క్రమంలో కొందరు టీడీపీ నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల టీడీపీకి చాలా నష్టం జరిగిందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. ఈ మొత్తం వ్యవహారంలో జనసేన కొంతమేర లాభపడినట్లు కనిపిస్తోంది. బాలయ్య, ఎన్టీయార్ విషయంలో జనసేన శ్రేణుల నుంచే కాస్తో కూస్తో సానుభూతి వ్యక్తమయ్యింది మరి.!