మైథిలాజికల్ టచ్ తో ఎన్టీఆర్ సినిమా?

ప్రస్తుతం ఇండియన్ సినిమా లో ఒక కొత్త ఒరవడి కనిపిస్తుంది. తరచూ హిందూయిజం, దైవ శక్తి చుట్టూ సినిమాలు రూపొందుతున్నాయి. ‘కార్తికేయ 2 ‘, ‘కాశ్మీర్ ఫైల్స్’, ‘ఆదిపురుష్’,  ‘రామ్ సేతు’, ‘కాంతార’ ఈ సినిమాలన్నీ ఉదాహరణలు. తాజాగా ఎన్టీఆర్ కూడా ఇలాంటి ఒక లైన్ తో ఒక సినిమా చేస్తున్నట్టు సమాచారం.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ అనేక కారణాల వల్ల డిలే అవుతూ వస్తుంది. ఈ మూవీ స్టోరీ గరుడ పురాణం లోని ఓ పాయింట్  చుట్టూ తిరుగుతుందంట. హిందూ మతంలోని 18 మహా పురాణ గ్రంథాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. ఇది వైష్ణవ సాహిత్య కార్పస్‌లో ఒక భాగం. మరి కొరటాల గరుడ పురాణంలో ఏ పాయింట్ ను తీసుకుని కథ రాసుకున్నాడో చూడాలి. కథలో అయితే కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలో బిజీ గా ఉన్న కొరటాల త్వరలోనే ఈ సినిమాని సెట్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. కియారా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు టీం.