NTR: విజయ్ దేవరకొండ సినిమాలో ఎన్టీఆర్…. హిట్టు కొడతాడా?

NTR: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో సినిమాలు సక్సెస్ ఇవ్వలేకపోతున్నాయి. ఈయన చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఈయన తదుపరి సినిమాపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన 12వ సినిమాను గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ నెల 12వ తేదీ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు టీజర్ కూడా విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ చిత్రాన్ని నాగ వంశీతో పాటు సాయి సౌజన్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక విజయ్ దేవరకొండ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎంతో మంది హీరోలు విజయ్ దేవరకొండకు అండగా నిలిచారని తెలుస్తుంది.ఈ సినిమా మార్చి 28న వివిధ భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో టీజర్ కు ఆయా ఇండస్ట్రీలలో ఉన్న స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తెలుగులో ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారని సమాచారం.హిందీ టీజర్ కు రణబీర్ కపూర్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలా ఈ స్టార్ హీరోలు అందరూ విజయ్ దేవరకొండకు అండగా నిలబడటంతో ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.