కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప నటుడు ఎన్టీఆర్ మాత్రమే.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన పై ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ నటన గురించి ప్రముఖ డైరెక్టర్ కన్మణి ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈయన ఎన్నో తెలుగు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నా ఊపిరి, బీరువా, చిన్నోడు వంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఒక ఏడ్చే సన్నివేశాలలో క్లోజప్ షాట్ చేసేటప్పుడు చాలామంది నటీనటుల నటనలో సహజత్వం ఉండదని తెలిపారు. కానీ ఇలా ఏడ్చే సన్నివేశాలను క్లోజప్ షాట్ లో తీసిన సహజంగా నటించే నటులలో కమల్ హాసన్ ఒకరు.

ఈ విధంగా కమల్ హాసన్ తర్వాత ఆ విధంగా నటించే ఒకే ఒక్క నటుడు ఎన్టీఆర్ మాత్రమేనని తెలిపారు.ఎన్టీఆర్ నటనలో కూడా ఎంతో సహజత్వం ఉంటుందని ఆయన తెలిపారు. ఇలా కమల్ హాసన్ తర్వాత అలా నటించే సత్తా ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్ మాత్రమేనని తెలిపారు. ఇక తాజాగా ఈయన నటించిన RRR సినిమాలోని కొమరం భీముడో పాటలో ఆయన హావభావాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు కురిపించారు.