Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సౌత్ సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం మనకు తెలిసినదే. ఇలా వరుస సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు కొత్త సినిమాలకు కూడా ఎన్టీఆర్ కమిట్ అవుతున్నారు.
ఇక ఎన్టీఆర్ సిని కెరియర్లో రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పాలి. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక ఇటీవల వీరి కాంబినేషన్లో వచ్చిన RRR సినిమా కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే మరోసారి రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలుస్తోంది.
భారత సినీ ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలు చేసినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అందించిన సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది నటీనటులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ సినిమా రాబోతుందని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టును రెండేళ్ల క్రితం మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతో రాజమౌళి సమర్పణలో డైరెక్టర్ నితిన్ కక్కర్ తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు కూడా బయటకు వచ్చాయి కానీ ఉన్నఫలంగా ఈ సినిమా విషయంలో మౌనం పాటించారు. తాజాగా మరోసారి దాదాసాహెబ్ ఫాల్కే సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారనే వార్తలు రావటంతో సినిమాపై మరిన్ని అంచనాలు కూడా పెరిగాయి. తాజాగా ఎన్టీఆర్‌ను దాదా సాహేబ్ ఫాల్కే లుక్‌లో AIతో రూపొందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతూ అభిమానులను సందడి చేస్తున్నాయి.