NTR: బాబాయ్ కి దగ్గరయ్యే ప్రయత్నంలో అబ్బాయిలు…. బాలయ్య చేరదీస్తారా?

NTR: నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఎన్టీఆర్ ని మాత్రం చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ తమ ఫ్యామిలీ మెంబర్గా ఆదరించలేకపోతున్న సంగతి పనుకు తెలిసిందే. హరికృష్ణ రెండో భార్య కుమారుడు కావడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ అలాగే తన తల్లిని దూరం పెడుతూ వచ్చారు.

ఇక తన తండ్రి హరికృష్ణ మరణం తర్వాత తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది కానీ నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ను ఆదరించలేకపోయారు ముఖ్యంగా బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరినీ కూడా దూరం పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే వీరిమధ్య గత కొంతకాలంగా మాటలు కూడా లేవని చెప్పాలి ఏదైనా వేడుకలో ఎదురుపడిన బాలకృష్ణ మాత్రం వీరిని పలకరించిన సందర్భాలు లేవు.

ఇలా ప్రతిసారి నందమూరి బాలకృష్ణ నుంచి ఎన్టీఆర్ కి అవమానం ఎదురవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆవేదన చెందారు. ఇకపోతే గత కొంతకాలంగా బాలకృష్ణకు సంబంధించిన ఏ విషయం గురించి అయినా కూడా ఎన్టీఆర్ స్పందిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తన బాబాయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మోక్షజ్ఞకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పుడు కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా తనకు అభినందనలు తెలియజేశారు.

తాజాగా బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో వెంటనే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా తన బాబాయికి అభినందనలు తెలుపుతూ పోస్టులు చేశారు. ఇలా ప్రతిసారి బాలకృష్ణకు సంబంధించిన అన్ని విషయాలపై వీరిద్దరూ స్పందిస్తూ పోస్టులు చేస్తున్న నేపథ్యంలో తన బాబాయ్ బాలకృష్ణకు దగ్గర అయ్యే ప్రయత్నాలు ఈ ఇద్దరు అబ్బాయిలు చేస్తున్నారని తెలుస్తుంది. మరి బాలయ్య వీరిద్దరిని హక్కున చేర్చుకుంటారా లేక తన కొడుకు కెరియర్ కోసం వీరిని దూరం పెడతారా అనేది తెలియాల్సి ఉంది.