అభిమాని అనారోగ్యం గురించి తెలిసి ఫోన్ చేసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్…!

ప్రముఖ టాలివుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన తాతకి తగ్గ వారసుడిలా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ప్రేక్షకులలో ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ కోసం ఆయన అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ కూడా తన అభిమానుల పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వహించలేదు. తన అభిమానులకి కష్టం వస్తే ఎన్టీఆర్ వెంటనే స్పందించి వారికి సహాయం చేస్తూ ఉంటాడు. తాజాగా తన అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఎన్టీఆర్ చేసిన పని ప్రస్తుతం చర్చంసనీయంగా మారింది.

అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ అభిమానులలో ఒకరైన జనార్ధన్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న ఎన్టీఆర్ జనార్ధన్ తల్లికి ఫోనే చేసి జనార్ధన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె తల్లిని అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా జనార్ధన్ తల్లికి కూడా దైర్యం చెప్పి ఏ కష్టం వచ్చిన నేను మీకు తోడుగా ఉంటాను.మీరు అధైర్య పడవద్దు అంటూ ఆమె దైర్యం చెప్పాడు. ఎన్టీఆర్ జనార్ధన్ తల్లితో ఫోన్ మాట్లాడిన వీడియో, ఆడియో రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ విషయం గురించి తెలుసుకున్న నేటిజన్స్ చేసిన పనికి ఆయనను అభినందిస్తున్నారు.ఈ వీడియో లో కాల్ రికార్డింగ్ లో ఫోన్ నెంబర్ కనిపించటం తో అందరి దృష్టి ఆ నెంబర్ పై పడింది. ఆ నెంబర్ ఎన్టీఆర్ దే అనుకోని చాలామంది ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ ఫోన్ నంబర్ ఎన్టీఆర్ మేనేజర్ ది అని సమాచారం . ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొట్టాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 అనే సినిమాలో నటించనున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి విడుదలైన ఒక వీడియో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.