ఎన్టీఆర్ కాళ్ళ‌పై ప‌డ్డ జ‌బ‌ర్ద‌‌స్త్ న‌టుడు.. అలా చేయోద్దంటూ జూనియ‌ర్ సూచ‌న‌

నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండ‌స్ట్రీలోకి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్నారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాల‌నే మ‌న‌స్త‌త్వం అత‌నిది. పెద్ద‌లంటే మ‌ర్యాద‌, అభిమానులంటే ప్రేమ ఎన్టీఆర్‌ని ఉన్న‌త స్థానంలో నిలిపేలా చేసింది. అంతేకాదు ఆయ‌న‌కు అశేష అభిమాన గ‌ణాన్ని కూడా సంపాదించిపెట్టింది. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ కాళ్ళ‌పై జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు ప‌డ‌డంతో అత‌ను ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.

వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మంలో రోడ్డు భ‌ద్ర‌త‌ల గురించి ఎన్టీఆర్ మాట్లాడ‌గా, దీని త‌ర్వాత త‌న చేతుల మీదుగా కొంద‌రికి స‌న్మానం చేశారు. అందులో హైప‌ర్ ఆది, రైజింగ్ రాజు ఉన్నారు. 60 ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న రాజు త‌న‌ను స‌న్మానించిన ఎన్టీఆర్ కాళ్ళు ప‌ట్టుకోబోయాడు. దీంతో షాక్ అయిన తార‌క్.. నా క‌న్న వ‌య‌స్సులో పెద్ద వారైన మీరు ఇలా నా కాళ్ల‌పై ప‌డ‌కూడ‌దు. ఇంకోసారి ఇలా చేయ‌కండి అని వారించాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన చూసి అక్కడున్న వాళ్లు కూడా సంతోషించారు. పెద్దవాళ్లకు ఈయన ఇచ్చిన గౌరవం కూడా అలాగే ఉంది.

ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కొమురం భీంగా ఆయ‌న న‌టించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఇప్ప‌టికే ఆయ‌న లుక్ విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు జూనియ‌ర్. అయిన‌ను పోవ‌లే హ‌స్తిన‌కు అనే టైటిల్ పెట్టనున్నార‌ని తెలుస్తుంది. అనంత‌రం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలోను జూనియ‌ర్ సినిమా చేయ‌నున్నాడు.