NTR: సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి…. స్పందించిన ఎన్టీఆర్…. ఏమన్నారంటే?

NTR: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో ఆయన గాయాలు పాలయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే ఇటు సౌత్ ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లోకి చొరబడి తనపై కత్తితో దాడి చేయడంతో ఈ విషయంపై సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన ఈ దాడి గురించి ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన ఈ దాడి గురించి వినీ తాను ఒక్కసారిగా షాక్ కి గురయ్యానని తెలిపారు.ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ నటించిన పాన్-ఇండియా చిత్రం దేవరలో సైఫ్ విలన్ గా నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడింది.

ఇక పోలీసులు తెలిపిన వివరాల మేరకు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఎలా జరిగిందనే విషయానికి వస్తే..తెల్లవారుజామున 3 :30 గంటల ప్రాంతంలో ముంబైలోని బాంద్రా వెస్ట్లోని సైఫ్ అలీఖాన్ నివాసంలో ఓ దొంగ ఇంట్లోకి చొరబడ్డారు అయితే ఇది గమనించిన పనిమనిషి ఆయనతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే ఇంట్లో నిద్రపోతున్న సైఫ్ వెంటనే లేచి చూసి పనిమనిషిని కాపాడేందుకు ప్రయత్నం చేయగా దుండగుడు కత్తితో సైఫ్ పై ఎటాక్ చేశాడు. ఆరు సార్లు సైఫ్ ను కత్తితో పొడిచి దుండగుడు అక్కడి నుంచి పారిపోయారు.

ఇలా ఏకంగా ఆయనపై ఆరుసార్లు కత్తితో దాడికి పాల్పడడంతో సైఫ్ అలీఖాన్ గాయాలు పాలయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు తనని ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్లు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా సైఫ్ అలీఖాన్ పై దాడి చేయడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది.. ఇక ఈ ఘటనలో పూర్తిస్థాయిలో సెలబ్రిటీలు ఈయనకు మద్దతు తెలుపుతూ ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.