తిరుపతిలో టీడీపీకి మద్దతుగా వాళ్ళు దిగబోతున్నారా..? అదిరిపోయే అప్డేట్

tdp

 తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సెగ మెల్ల మెల్లగా రాజుకుంటుంది. ఈ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించి ఎలాగైనా పూర్వ వైభవం సంపాదించాలని టీడీపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంటే, వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవటంతో పాటు, ఈ ఫలితాలు తమ పాలనాకు ఒక నిదర్శనం అని చూపించుకోలేని అధికార పార్టీ ఆరాట పడుతుంది. ఇక బీజేపీ జనసేన పార్టీలు ఎవరు ఈ స్థానం నుండి పోటీచేయాలనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు, ఒకవేళ ఇద్దరు కలిసి పోటీచేసిన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సింది తప్పితే మరొక ఛాన్స్ అయితే లేదు.

tdp ycp

 ప్రధానంగా పోటీ టీడీపీ మరియు వైసీపీ మధ్యనే ఉందనేది వాస్తవం. ఈ పోరులో ప్రస్తుతానికైతే టీడీపీ పైచెయ్యి సాధించిందనే చెప్పాలి. వైసీపీ కంటే ముందుగా తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల సమరానికి సిద్ధమైంది టీడీపీ . ఇదే సమయంలో తన శక్తి యుక్తులను ఏకం చేసే దిశగా సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో ఎన్నారైల సేవలు ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. టీడీపీకి మొదటి నుండి కూడా ఎన్నారై సపోర్ట్ గట్టిగానే ఉంటుంది. విదేశాలలో టీడీపీకి ఉన్నంత సపోర్ట్ మరో ప్రాంతీయ పార్టీకి లేదనేది వాస్తవం. టీడీపీ కి మద్దతుగా నిలబడే ఎన్నారైలు అందరు కూడా నిస్వార్థంగా పార్టీకోసం పనిచేసే వాళ్ళు కావటం టీడీపీకి బాగా కలిచొచ్చే అంశం.

NRI TDP

ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో ఎన్నారై లు తమవంతు సహాయసహకారాలు అందించబోతున్నట్లు కొన్ని ఎన్నారై వర్గాల నుండి సమాచారం వస్తుంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో కలిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నారైలు డిజిటల్ ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని, ఆంధ్ర మూలాలు కలిగిన ఎన్నారైలు ఆ ఏడూ నియోజకవర్గాల ప్రజలతో స్వయంగా ఫోన్స్ మరియు వీడియో కాన్ఫిరెన్స్ లు ఏర్పాటు చేసి, అక్కడి సమస్యలు తెలుసుకోవటం, అదే విధంగా గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి గురించి వివరించటం, టీడీపీ గెలిస్తే రాబోయే రోజుల్లో జరగబోయే అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించి ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు కోరే అవకాశం ఉంది.

ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ మద్దతుదారులైన ఎన్నారైలు తిరుపతి ఉప ఎన్నికల్లో తమవంతు కృషి చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్థానికంగా టీడీపీ నాయకత్వం నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇలాంటి సమయంలో వాళ్ళకి సపోర్ట్ గా ఎన్నారైలు కూడా రంగంలోకి దిగితే టీడీపీ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా వుండే అవకాశం వుంది.