పాపం..ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మళ్ళీ మరో సరికొత్త టెన్షన్..!

NTR Fans : టాలీవుడ్ మాసెస్ట్ బిగ్ హీరోల్లో నందమూరి ఫ్యామిలీ లెగసి క్యారియర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. అయితే ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో తన ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని అందించాడు. దర్శకుడు రాజమౌళితో ఎన్టీఆర్ చేసిన ఈ సినిమాలో తాను కొమరం భీమ్ పాత్ర చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.
అయినా కూడా ఎక్కడో తారక్ అభిమానుల్లో వెలితి అయితే కనిపించింది. ముందు అంతా సినిమాలో ఎన్టీఆర్ పైనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటే రాజమోళి చూపించిన తీరుతో అనేక కామెంట్స్ చేశారు. మరి ఇదే వారికి పెద్ద దెబ్బ అనుకుంటే ఇప్పుడు వారిలో మళ్ళీ ఇంకో కొత్త రకం టెన్షన్ మొదలయ్యింది.
మరి దీనికి కారణం కొరటాల శివ అట. మరి ఈ స్టోరీ లోకి వచ్చినట్టు అయితే ఈ సినిమాలో తాజాగా రామ్ చరణ్ నటించిన “ఆచార్య” సినిమా ఊహించని ఫలితాన్ని అందుకుంది అది కూడా రాజమౌళి సినిమా తర్వాత సెంటిమెంట్ తోనే ఇక మరోపక్క చూస్తే మళ్ళీ ఇదే కొరటాలతో అదే రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా చెయ్యబోతున్నాడు.
అంటే ఈ లెక్కన ఎన్టీఆర్ తో సినిమా కూడా…. అనే సందిగ్ధం లో పడ్డారు. అయితే కొంతమంది కొంచెం కాన్ఫిడెన్స్ గానే ఉన్నా ఎక్కడో మాత్రం వారిలో కూడా ఆ సినిమా ఫలితంపై ఇప్పుడు నుంచే టెన్షన్ పట్టుకుంది. మరి ఫ్యూచర్ లో కొరటాల ఏం చేస్తాడో చూడాలి. అసలే ఈ సినిమాని కూడా భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగానే అనౌన్స్ చేశారు.