Abhishek Bachchan: సాధారణంగా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే వారికి ఎన్నో అవకాశాలు వస్తాయని చాలా మంది భావిస్తుంటారు. వారు అవకాశాల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎంతో మంది దర్శక నిర్మాతలు కథ చేతపట్టుకుని వారి ముందు క్యూ కడతారని చాలా మంది భావిస్తారు. కానీ అదంతా కేవలం వారి అపోహ మాత్రమేనని తాజాగా అమితాబ్ బచ్చన్ కొడుకు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ నటుడిగా వరుస సినిమాలలో నటించిన కొన్నిసార్లు పని లేకుండా ఖాళీగా ఉన్న ఇదంతా కూడా కేవలం ఒక వ్యాపారం పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. నువ్వు నటించిన సినిమాలు ఆడుతుంటేనే ఎవరైనా నీ పై డబ్బు పెట్టడానికి శ్రద్ధ చూపిస్తారు అలా లేని పక్షంలో ఎవరికి అవకాశాలు రావని ఈ ఇంటర్వ్యూలో అభిషేక్ వెల్లడించారు.
నేను అమితాబచ్చన్ కొడుకు అయినప్పటికీ ఎవరిని అమితాబచ్చన్ కొడుకుగా నాతో సినిమా చేయమని అడగలేదు.నా మొదటి సినిమా చేయడం కోసం దాదాపు రెండు సంవత్సరాలు ఎదురు చూశానని మొదట్లో డైరెక్టర్ నాతో సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదని ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి వెల్లడించారు.నటుడిగా నా కెరీర్ ప్రారంభించడానికి ఎంతో మంది దర్శకులతో మాట్లాడాను అయితే అప్పుడు ప్రతి ఒక్కరు నో అనే సమాధానం చెప్పారని ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ వెల్లడించారు.