మంత్రి కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్

హెరిటేజ్ కేసులో మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబులకు నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు విచారణ శుక్రవారం జరిగింది. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో వచ్చే వాయిదాకు రావాల్సిందేనని కోర్టు పేర్కొంటూ ఈ మేరకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

 

NBW issues against minister Kannababu and MLA Ambati Rambabu in Heritage case

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కన్నబాబు, అంబటి హెరిటేజ్ సంస్థ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది. ఎవరైనా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయో.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా, వైసీపీ నేతలు విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది. అటు, హెరిటేజ్ అధికారి సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగైతే కేసు మూసివేస్తామని గత విచారణలో స్పష్టం చేసింది.