అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప… హీరోలూ, విలన్లూ లేరీ నాటకంలో! అనుకోవాలో.. లేక, అధికారం కోసం, పదవులకోసం ప్రాకులాడేవారే తప్ప.. నిజంగా తనను అభిమానించేవారు లేరీ ఫ్యామిలీలో అని చంద్రబాబు అనుకుంటున్నారేమో అనే అనుమానం తాజాగా తెరపైకి వచ్చింది. చంద్రబాబు అంటే ఆయన కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు గానీ, శ్రేయోభిలాషులకు కానీ నిజంగా ప్రేమ లేదని అంటున్నారు.
చంద్రబాబు బయటకు రావాలని, లోపలే ఉండిపోకూడదని, మళ్లీ జనాల్లోకి రావాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన కుటుంబ సభ్యులు పైకి చూపిస్తున్న తాపత్రయం వేరు.. ఒరిజినల్ గా వారి ఫెర్మార్మెన్స్ వేరు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాలపై తాజాగా అధికార వైసీపీ ఆన్ లైన్ వేదికగా పేర్కొంది. ఇప్పటికే పలువురు విశ్లేషకులు ఈ విషయంపై టీవీలలో క్లారిటీ ఇస్తున్నారు. క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్టై ఇప్పటికే 40 రోజులు పూర్తయ్యింది. ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు మాటల్లో ఒకటి, చేతల్లో మరొకటి చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కారణం… చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనాలు అందరూ రోడ్లపైకి రావాలని పిలుపునిస్తున్నారే తప్ప… వారు మాత్రం వారానికి ఐదునిమిషాలే బయటకు వస్తున్నారు. ఎవరి పనుల్లో, ఎవరి వ్యాపారాల్లో వారు బిజీగా ఉంటున్నట్లున్నారు.
ఇదే విషయాలపై అధికార వైసీపీ ట్విట్టర్ లో పేర్కొంది. ఇందులో భాగంగా… “చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రం అట్టుడికిపోతున్నట్లు జై టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కరోజూ కూడా ఎక్కడా కనీసం హెరిటేజ్ ని మూసిన దాఖలాలు కనిపించలేదు. నేను వస్తున్నా అంటూ గప్పాలు కొట్టిన బాలయ్య.. హైదరాబాద్ కి వెళ్లిపోయి కులాసాగా సినిమా పూర్తి చేసుకుని ఈరోజు రిలీజ్ చేసుకున్నాడు” అని ట్వీట్ చేశారు. ఇది ఆలోచించపచేసేలా ఉందనే కామెంట్ళు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో… “హెరిటేజ్ బిజినెస్ చూసుకుంటూ నారా బ్రాహ్మణి, భువనేశ్వరి వీకెండ్ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక నారా లోకేష్ తాపీగా ఢిల్లీకి వెళ్లి ఎంజాయ్ చేసి.. ఎప్పుడోగానీ ఏపీ వైపు చూడట్లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్యాకేజీ పోవడంతో పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నాడు. కానీ.. వీళ్ల మాటలు నమ్మిన కొంత మంది సామాన్యులు మాత్రం అన్నిరకాలుగా నష్టపోతున్నారు” అని ట్విట్టర్ లో పేర్కొంది వైసీపీ.
దీంతో… వైసీపీ తెలిపిన అంశాలన్నీ చాలా కన్వెన్సింగ్ గా ఉన్నాయని… వీటిపై టీడీపీ నేతలు రియాక్ట్ అవ్వాలని, లేనిపక్షంలో ఈ విషయంలో జనాల్లోకి వన్ సైడ్ గా బలంగా దూసుకెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా… బాబు అరెస్ట్ అనేది ఒక వీకెండ్ నిరసన కార్యక్రమంలా మారిపోవడంపై అభిమానులు మాత్రం హర్ట్ అవుతున్నారంట. హెరిటేజ్ షాపులు మూసేసి… వాటి షట్టర్ మీద “చంద్రబాబు అరెస్టుకు నిరసనగా” అని ఒక ఫ్లెక్సీ కడితే ఆ లెక్క వేరేగా ఉండేదని చెబుతున్నారు. అయితే… చంద్రబాబు కోసం భువనేశ్వరి అంత త్యాగం చేస్తారా అన్నది ఇక్కడ పాయింట్!