జగన్ ను కలవడానికి ఎవరూ రావడం లేదు: నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా సీఎం జగన్ ను ప్రశ్నించాడు. ప్రస్తుతం జగన్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నారా లోకేష్.. జగన్ ను ఉద్దేశించి.. ఏపీ రాజధాని ఏదంటే దావోస్లో సీఎం జగన్ ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించాడు. దావోస్ లో వైకాపా నేతల మీటింగ్ జరుగుతున్నట్లు ఉంది తప్ప పెట్టుబడుల కోసం జగన్ అక్కడికి వెళ్ళినట్లు లేదని అన్నాడు.

అక్కడున్న పారిశ్రామికవేత్తలు ఆయనను కలవడానికి ఎవరూ రావడం లేదు అని.. ఇప్పటి వరకు ఆయనను కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీయే అని అన్నాడు. ఆయనను కలవడానికి అక్కడికి వెళ్లడం దేనికి.. ఢిల్లీలో కూడా ఆయన కలుస్తారు.. అక్కడికి వెళ్ళడం కోసం జగన్ 8 కోట్లు ఖర్చు చేశాడు అని.. దావోస్ కి కూడా నేరుగా వెళ్ళకుండా లండన్ కి ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్నించాడు.