Savithri:బయోపిక్ అనగానే ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ప్రేక్షకులు ఆదరించే విధంగా తీస్తే ప్రశంసలే మిగులుతాయి. అలాగే ఈ సినిమాకి కూడా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. అందులో ఒక సన్నివేశం పై వచ్చిన కామెంట్స్ పై తెలుగు సినీ రచయిత సాయి మాధవ్ బుర్రా స్పందించారు.
మహానటి సినిమాలో సావిత్రి చాలా డౌన్ ఫాల్ అయినపుడు ఒక సీన్లో భోజనం కూడా పెట్టలేదు. అప్పుడు ఆమె అలాగే నిల్చొని ఉంది. అపుడు మోహన్ బాబు వచ్చి ఏంటమ్మా ఇంకా భోజనం చేయలేదా అంటే.. లేదండి అని ఆమె అంటుంది. అప్పుడు అతనికి అర్థం అవుతుంది.. ఆమెకు ఎవరూ భోజనం పెట్టడం లేదని. ఆపుడు ఆమెను తీసుకెళ్ళి రామ్మా నా క్యారేజ్ ఉంది అంటూ ఆయన తీసుకెళ్లారు. మహానటి సినిమాలో మోహన్ బాబు ఉ ఎస్.వి.రంగారావు పాత్రను నిర్వహించారు. నిజానికి ఆ క్యారెక్టర్ గుమ్మడి గారిది. కానీ ఈ సినిమాలో ఎస్వీ రంగారావు గారిని చూపించడం జరిగింది. అప్పట్లో ఈ సన్నివేశం పైన కొన్ని విమర్శలూ వచ్చాయి. అదే విషయం తాను డైరెక్టర్ని కూడా అడిగానని సినీ రచయిత సాయి మాధవ్ బుర్రా అన్నారు.
నిజానికి మనం ఆ పాత్రకి అనుకున్నది గుమ్మడి గారిని కదా మరి ఎస్వీ. రంగారావు పాత్రలు పెట్టారు అది కాకుండా గోరింటాకు సినిమా సందర్భంలో ఎస్.వి.రంగారావు లేరు కదా అని తాను అడిగినట్టు ఆయన చెప్పారు. అప్పుడు డైరెక్టర్ ఇచ్చిన సమాధానం నాకు చాలా అద్భుతంగా అనిపించింది అంటూ ఆయన వివరించారు. అదేమిటంటే నిజానికి మహానటిలో గుమ్మడి గారి క్యారెక్టర్ లేదు కానీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ ని పరిచయం చేయాలంటే ఆయన కోసం మరొక సీను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా డా.డి గారు ఈయన అని చెప్పడానికి ప్రత్యేకించి ప్రేక్షకుల చెప్పడానికి మరొక సందర్భమూ కావాలి. మోహన్బాబు ఇదివరకే మాయా బజార్ లో ఎస్.వి.రంగారావు లా ఆల్రెడీ ఓన్ అయిపోయి ఉన్నారు. కాబట్టి జనాలకు మళ్లీ మోహన్ బాబు, ఎస్.వి.రంగారావు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే గుమ్మడి గారైతే ఈయన ఎస్.వి.రంగారావు అని చెప్పడానికి మరొక సీన్ ను పెట్టాలి.
ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సినీ పరిశ్రమను ఏలిన సావిత్రి ఇలాంటి మహానటిని పట్టించుకునే వారే లేకపోయారు అని అని చెప్పడమే లక్ష్యం. ఆవిడతో కలిసి నటించిన ఒక సహనటుడు గుర్తించే అంతవరకు ఆమె స్థితిని తెలియకుండా ఉందని చెప్పడమే అక్కడ ఇంపార్టెంట్. కానీ ఆ సాటి నటుడు ఎస్.వి.రంగారావా, గుమ్మడి గారా అనేది మాత్రం ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ గుమ్మడి గారి గురించి చెప్పాలనుకుంటే అది ఎస్ వి రంగారావు గారి గొప్పతనం గా చేసి చెప్పడం తప్పే. కానీ తాను చెప్పదలుచుకున్నది ఇది గుమ్మడి గారి గురించి కాదు అక్కడ అ సావిత్రిగారి ఉన్న స్థితిని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. అక్కడ ఒక మంచి డైలాగ్ కూడా ఉంటుంది అమ్మ ఈ రోజుల్లో అన్నం పెట్టే చేతికున్న ఉంగరాలు కూడా లాగేసుకునే రకాలమ్మా. ప్రస్తుతం మనుషులు అలా తయారు అయ్యారు అనే డైలాగ్ మోహన్ బాబు గారు నోటివెంట వస్తే అందరూ వింటారు. అప్పుడే ఆ డైలాగ్ జనాల్లోకి వెళ్ళుతుంది. అది కాకుండా ఆ ప్లేస్లో వేరే ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి గుమ్మడి గారి గురించి చెప్పి మళ్ళీ ఈ డైలాగ్ లు వేసి చేస్తే తెనాలిలో కి అంత ఎక్కడ అని అనిపించింది. అందుకే అప్పుడే అప్పటికి ఓన్ అందుకే మోహన్ బాబు గారిని ఎస్వీ రంగారావు పాత్రతో ఆ డైలాగ్ ని చెప్పించాము. ఆ విషయం నాక్కూడా తెలుసు అని డైరెక్టర్ చెప్పినప్పుడు నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది అని సాయిమాధవ్ బుర్రా వివరించారు.అ