ఆ ఒక్క పని చేస్తేనే తెలంగాణలో షర్మిల పార్టీకి భవిష్యత్తు!

తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని అధికారంలోకి తీసుకొనిరావాలని షర్మిల భావిస్తున్నారు. అయితే ఆమె ఎంత కష్టపడుతున్నా తెలంగాణ ముఖ్య నేతలు మాత్రం ఆమెను పట్టించుకునే పరిస్థితులు అయితే లేవు. షార్మిల పార్టీ వైపు ఇతర పార్టీల నేతలు కన్నెత్తి కూడా చూడటం లేదు. మరో 18 నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ కు వైఎస్సార్‌టీపీ ప్రత్యామ్నాయం అవుతుందని అందరూ అనుకుంటే అందుకు భిన్నంగా జరుగుతోంది. బీజేపీలో ఉన్న అసంతృప్త నాయకులు టీఆర్ఎస్‌ వైపు వెళుతుంటే కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్త నాయకులు బీజేపీ, టీఆర్ఎస్‌ వైపు వెళుతుండటం గమనార్హం. తెలంగాణలో షర్మిల పార్టీకి భవిష్యత్ ఉందని ఇతర పార్టీల నేతలు నమ్మడం లేదు. అధికార పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై షర్మిల పోరాడుతున్నా ప్రజలు సైతం పట్టించుకోవడం లేదు.

అయితే ఇదే సమయంలో జగన్ సపోర్ట్ చేస్తే మాత్రమే షర్మిల పార్టీ భవిష్యత్తు మారే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల విషయంలో ప్రజలపై పాజిటివ్ ఒపీనియన్ ఉంది. జగన్ అమలు చేస్తున్న పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలైతే బాగుంటుందని చాలామంది భావిస్తుండటం గమనార్హం. అయితే జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

జగన్ షర్మిల కలిస్తే మాత్రం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. కష్టపడితే ఆలస్యంగానైనా అనుకూల ఫలితాలు వస్తాయని షర్మిల భావిస్తున్నా తెలివిగా కష్టపడితే మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. షర్మిల జగన్ కు దూరంగా ఉంటే మాత్రం ఆమెకు నష్టమే తప్ప ఏ మాత్రం ప్రయోజనం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.