అమ్మ బాబోయ్ అలా ప్లాన్ చేశాడా?.. హనీమూన్‌ కోసం నితిన్ స్కెచ్ అదిరింది!!

Nithin shalini At Dubai

లాక్డౌన్ వల్ల హీరోల పెళ్లిళ్లు చాలా డల్‌గా జరిగాయి. లేదంటే టాలీవుడ్ మొత్తం దుమ్ములేచిపోయేది. హీరో నితిన్ అయితే ఏకంగా దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాడు. దాని కోసం ఆల్రెడీ ఐదు కోట్లు ఖర్చు పెట్టేశారు. కానీ లాక్డౌన్ అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. ఇక చేసేదేమీ లేక నితిన్ హైద్రాబాద్‌లోనే అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. రానా, నిఖిల్ కూడా అలానే సమీప బంధుమిత్రులను ఆహ్వానించి వివాహాలు చేసుకున్నారు.

Nithin shalini At Dubai

అయితే రానా మాత్రం అందరి కంటే ముందుగా హనీమూన్‌కు వెళ్లాడు. రానా మిహీక ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ బీచ్‌లో దొర్లుతూ బాగానే సందడి చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నిఖిల్ తన భార్యను తీసుకుని బయటకు వెళ్లాడు. కానీ నితిన్ ఇంత వరకు బయటకు వెళ్లనే లేదు. కానీ తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. నితిన్ వేసిన స్కెచ్ అదిరిపోయింది.

రంగ్ దే సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. టైం వేస్ట్ చేయడమెందుకని నితిన్ తన భార్యను అక్కడికి తీసుకెళ్లాడు. ఇలా షూటింగ్‌కు షూటింగ్ అవుతుంది.. హనీమూన్‌కూ వెళ్లినట్టు ఉంటుందని భావించాడో ఏమో గానీ ప్రస్తుతం ఈ జంట దుబాయ్‌లో రచ్చ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నితిన్ ప్రస్తుతం పలుప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. చెక్, అంధాదున్ రీమేక్ వంటి సినిమాలను పట్టాలెక్కించాడు.