థియేటర్లలో పోయిన నితిన్ సినిమా టీవీల్లో మెరిసింది !

Nithiin's Rang De gets more TRP than Bheeshma
Nithiin's Rang De gets more TRP than Bheeshma
హీరో నితిన్ ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరిస్తే రెండూ పోయాయి.  వాటిలో ‘రంగ్ దే’ ఒకటి.  పాజిటివ్ బజ్ నడుమ విడుదలైనప్పటికీ సినిమా ఆకట్టుకోలేకపోయింది.  ఫస్ట్ డే నుండే నెగటివ్ టాక్.  పైగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న టైంలో రావడంతో పూర్తిగా దెబ్బతింది.  నితిన్ సైతం ఈ సినిమా మీద గట్టిగానే హోప్స్ పెట్టుకున్నాడు.  కానీ ఊహించని రీతిలో పరాజయాన్ని అందుకున్నాడు.  బిజినెస్ పరంగ అయితే హక్కులు కొన్న డీస్ట్రీబ్యూటర్లకు నష్టాలు గట్టిగానే మిగిలాయి. ఇలా బిగ్ స్క్రీన్ మీద సినిమాను రిజెక్ట్ చేసిన ప్రేక్షకులు బుల్లితెర మీద మాత్రం విశేషంగా ఆదరించారు. 
 
జీ తెలుగు ఛానెల్ నందు సినిమా తాజాగా ప్రసారం అయింది.  ఏకంగా 7.72 టిఆర్పీ సొంతం చేసుకుంది.  ఒక డిజాస్టర్ సినిమాకు ఈ స్థాయి టిఆర్పీ అంటే ఎక్కువే అనాలి. పైగా చిత్రం ఓటీటీల్లో కూడ ఉంది.  అయినా బుల్లితెర మీద అదరగొట్టింది.  నితిన్ కెరీర్లోని బెస్ట్ హిట్ సినిమాల్లో ‘భీష్మ’ ఒకటి.  ఈ సినిమా కమర్షియల్ హిట్.  బిగ్ స్క్రీన్ మీద విశేషంగా ఆకట్టుకుంది. టీవీల్లో మాత్రం 6.65 రేటింగ్ మాత్రమే సాధించింది.  దీనికంటే ‘రంగ్ దే’ సినిమానే ఎక్కువ స్కోర్ చేసింది. అంటే దీన్నిబట్టి సినిమా థియేట్రికల్ ఫలితాన్ని టీవీ టిఆర్పీలకు సంబంధం లేదని అర్థమవుతోంది. ‘రంగ్ దే’ తరహాలోనే సినిమా హాళ్లలో ఫ్లాప్ అనిపించుకుని ఇప్పటికీ బుల్లితెర మీద ఆదరగొడుతున్న ‘అతడు’ లాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి.