Bigg Boss Telugu 9: తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే అతి పెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి. ఇప్పటికే తెలుగులో 8 సీజన్ లు విజయవంతంగా పూర్తి అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తోంది. అయితే ఇటీవలే 9 వ సీజన్ మొదలైన విషయం తెలిసిందే. అయితే బిగ్‌బాస్ ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ నాగార్జున చెప్తూనే ఉన్నాడు. దాన్ని కంటెస్టెంట్లు ఎలా అర్థం చేసుకున్నారో కానీ హౌస్ లో తెలివిగా పావులు కదపడానికి బదులు గొడవలు, కొట్లాటలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.
అయితే బిగ్ బాస్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంటే ఇలా చేస్తున్నారేంట్రా? అని జనం కంటెస్టెంట్లను ముఖ్యంగా కామనర్లను తెగ తిట్టుకుంటున్నారు. ఇకపోతే ఈ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. వరుసగా ఏడోసారి నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడూ సెలబ్రిటీలనే తీసుకునే బిగ్‌బాస్ ఈసారి కామనర్లపైనా ఒక కన్నేశాడు. సెలబ్రిటీలను తొమ్మిది మందిని, అగ్నిపరీక్ష ద్వారా ఆరుగురు కామనర్లను హౌస్ లోకి పంపించాడు. ఈ సారి డబల్ హౌస్ అంటూ ఊరించడం, కామనర్ల రాకకోసం స్పెషల్ గా అగ్నిపరీక్ష పెట్టడంతో షోపై మంచి బజ్ క్రియేట్ అయింది.
దీంతో బిగ్‌బాస్ 9 లాంచింగ్ ఎపిసోడ్ దద్దరిల్లిపోతుందనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అత్యంత దారుణమైన టీఆర్పీ వచ్చింది. ఈసారి 13.7 రేటింగ్ వచ్చినట్లు స్వయంగా నాగార్జునే వెల్లడించాడు. అలాగే లాంచింగ్ ఎపిసోడ్ ను 5.9 బిలియన్ మినిట్స్ వీక్షించారని తెలిపాడు. కానీ ఇవి గతంలో వచ్చిన రికార్డులకంటే ఎక్కువేం కాదని చెప్పాలి. అయితే గతంలో వచ్చిన టీఆర్పీ రేటింగ్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కి వచ్చింది చాలా దారుణమైన టీఆర్పీ రేటింగ్ అని చెప్పాలి. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ కు 16.18 టీఆర్పీ రాగా, నాని హోస్టింగ్ చేసిన రెండో సీజన్‌కు 15.05 వచ్చింది. ఇక మూడో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 17.92, నాలుగో సీజన్‌కు 18.50, ఐదో సీజన్‌కు 18, ఆరో సీజన్‌కు 8.86, ఏడో సీజన్‌కు 18.1, ఎనిమిదో సీజన్‌కు 18.9 రేటింగ్ వచ్చింది. ఈసారి ఏడో సీజన్ మినహా మిగతా అన్ని సీజన్లకంటే తక్కువగా 13.7 వచ్చింది.
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ షోకి దారుణమైన టీఆర్పీ రేటింగ్.. ఇలా అయితే ముందు ముందు కస్టమే!
