Macherla Niyojakavargam Teaser : ‘మాచర్ల’ లో మాస్ జాతర చూపిస్తున్న నితిన్.. కొత్త టీజర్ చూసారా?

Macherla Niyojakavargam Teaser : ప్రస్తుతం అత్యవసరంగా మంచి హిట్ మరియు కం బ్యాక్ కోరుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుని యూత్ స్టార్ గా ఒక టాగ్ సంపాదించుకొని డిఫరెంట్ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అయితే ఈ చిత్రాల్లో అసలు తన కెరీర్ లోనే ఏ సినిమా కూడా చెయ్యని రేంజ్ మాస్ ఎలిమెంట్స్ తో చేస్తున్న చిత్రం “మాచర్ల నియోజకవర్గం”.
దాదాపు వారి ఫ్యామిలీ మెంబర్స్ నే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ గా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం నుంచి ఈరోజు నితిన్ బర్త్ డే కానుకగా మేకర్స్ ఒక మాస్ టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఇది మాత్రం అసలు ఊహించని రేంజ్ లో ఉందని చెప్పాలి. బహుశా నితిన్ ని కూడా ఈ రేంజ్ లో తన ఫ్యాన్స్ చూసి ఉండకపోవచ్చు.
అలాగే ఇందులో కనిపించిన ప్రతి షాట్ కూడా స్టన్నింగ్ గా పవర్ ఫుల్ గా ఉండగా సినిమాలో మాత్రం ఈ పోరాట సన్నివేశం వన్ ఆఫ్ ది పవర్ ఫుల్ ఫైట్ సీన్ లా అనిపిస్తుంది. మొత్తంగా అయితే మాచర్ల నుంచి మాత్రం నితిన్ మాస్ జాతర చూపించనున్నట్టు ఈ ఫైట్ సీన్ తో చూపించకనే చెప్పేసాడు.
ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించారు. అలాగే నితిన్ వాళ్ళ నాన్న బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.