కాంగ్రెస్, భాజపా చిల్లర రాజకీయాలు చేయడం మానుకొండంటున్న నిరంజన్ రెడ్డి..!

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్ చేస్తున్న సాయం పై వస్తున్న విమర్శలను ఖండించాడు. తెలంగాణలో ఇప్పటికీ చాలామంది రైతు కుటుంబాలకు రైతు బీమా అందించామని.. ప్రపంచంలో కూడా ఇటువంటి పథకం లేదు అని అన్నాడు. ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు చేస్తున్న సాయంపై కాంగ్రెస్, భాజపా చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని అన్నడు.

ఇకపై అలాంటివి చేయడం మానుకోమని అన్నాడు. అసలు ఈ పార్టీలకు ఇలాంటి పథకాలు అమలు చేసే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించాడు. కాంగ్రెస్ పాలనలో ఇటువంటి పథకాలు చేయటానికి ఎన్నో ప్రయత్నాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అని అన్నాడు. అధికారం పై ఆశతో కాంగ్రెస్, భాజపా పగటి కలలు కంటున్నాయని అన్నాడు. అంతేకాకుండా ఈ పార్టీల గురించి కొన్ని విషయాలు కూడా బయటపెట్టాడు.