“కార్తికేయ 2” రిలీజ్ గాసిప్స్ పై బిగ్ క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్.!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో తమ సినిమాలకు అంటూ ఒక సెపరేట్ ట్రాక్ ని సెట్ చేసుకున్న హీరోల్లో నిఖిల్ కూడా ఒకడు. రెగ్యులర్ సినిమాలను తప్పించి ఎప్పుడైతే థ్రిల్లర్ జానర్ లోకి తాను వచ్చాడో అక్కడ నుంచి తన ఫేట్ అయితే మారిపోయింది.

అలా అనేక సినిమాలు చేసి భారీ హిట్ సినిమాలు అందుకున్న తాను ఆ హిట్ సినిమాల్లో ఒకటైన “కార్తికేయ” కి సీక్వెల్ ని “కార్తికేయ 2” చేసి రిలీజ్ కి రెడీ అయ్యాడు. మరి దీని నుంచి వచ్చిన ట్రైలర్ కూడా షాకింగ్ రెస్పాన్స్ మరియు విజువల్స్ తో పాన్ ఇండియా లెవెల్లో ఆసక్తి రేపగా మేకర్స్ అయితే రిలీజ్ ని ఈ జూలై 22కి ఫిక్స్ చేశారు.

కానీ కొన్ని రోజులు నుంచి అయితే ఈ సినిమా విడుదల ఆగినట్టుగా గాసిప్స్ వినిపించగా ఇప్పుడు దీనిపై అయితే హీరో బిగ్ క్లారిటీ ఇచ్చాడు. ఓవర్సీస్ లో ఈ చిత్రం ఆల్రెడీ మంచి బుకింగ్స్ ఓపెన్ చేయగా మంచి బుకింగ్స్ ని కూడా నమోదు చేస్తుండగా నిఖిల్ వారికి సారి చెప్తూ సినిమా రిలీజ్ ఇప్పుడు అవ్వట్లేదని.. 

అలాగే రిలీజ్ కూడా ఆగస్ట్ లో చేస్తున్నట్టు తెలిపాడు. అయితే ఇంకా కొత్త డేట్ ని కూడా అనౌన్స్ చెయ్యాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చందూ మొండేటి దర్శకత్వం వహించారు.