ఆ స్టార్ క్రికెటర్ తో నిధి అగర్వాల్ డేటింగ్?

క్రికెటర్ స్టార్స్, సినిమా స్టార్స్ డేటింగ్ అనేది చాలా కాలం గా ఉంది. అప్పట్లో నీనా గుప్త వెస్ట్ ఇండీస్ స్టార్ బాట్స్మన్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసి ఒక అమ్మాయింది కూడా కనింది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షర్మిల టాగోర్, ఇండియన్ క్రికెటర్ పటౌడీ ని పెళ్లి చేసుకుంది.

కొంత కాలం క్రితం నగ్మా, సౌరవ్ గంగూలీ కూడా డేటింగ్ చేసారని కొన్ని వార్తలొచ్చాయి. ఆ మధ్య అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక క్రికెటర్ తో లవ్ లో ఉన్నట్టు కొన్ని గోషిప్స్ కూడా వచ్చాయి.

ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇండియన్ స్టార్ క్రికెటర్ కే యల్ రాహుల్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాను మాత్రం అలాంటిదేమి లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. ఇప్పటికే కే యల్ రాహుల్ సునీల్ శెట్టి కూతురు తో ప్రేమలో ఉన్నట్టు, త్వరలో ఇద్దరూ పెళ్లిచేసుకుంటారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి.