Venu Swamy: మళ్లీ వేణు స్వామినే నమ్ముకున్న స్టార్ హీరోయిన్… సినిమాల విడుదల వేళ ప్రత్యేక పూజలు?

Venu Swany: వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీల జాతకాలను అలాగే రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల కాలంలో ఈయన సెలెబ్రెటీల జాతకాలని చెబుతూ వివాదాలలో నిలవడమే కాకుండా ఈయనపై కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే. ఇలా నిత్యం ఏదో ఒక వివాదంలో నిలుస్తున్న వేణు స్వామి దగ్గర ఎంతో మంది హీరోయిన్లు సక్సెస్ కోసం పూజలు చేయించుకుంటున్నారు.

ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ కావడం కోసం తరచూ సెలబ్రిటీలు వేణు స్వామి దగ్గర పూజలు చేయిస్తున్నారు. తాజాగా మరొక స్టార్ హీరోయిన్ సైతం వేణు స్వామిని సంప్రదించి తన కెరియర్ సక్సెస్ కోసం పూజలు చేయించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి మరి వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకున్న ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్నికి వస్తే ఆమె మరెవరో కాదు నటి నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ గతంలో కూడా వేణు స్వామి చేత పూజలు చేయించారు అయితే త్వరలోనే ఈమె నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ప్రభాస్ సరసన నటించిన రాజా సాబ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇలా ఈ రెండు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాల సక్సెస్ కోసమే ఈమె వేణు స్వామిని కలిసి పూజలు చేయించారని సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడంతో నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన నటించినా, సినిమా పై నమ్మకం లేదా అందుకే వేణు స్వామిని నమ్ముకున్నారా అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. మరి జులై 24వ తేదీ రాబోయే ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.