వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు మంచి కంటే కూడా చేదే ఎక్కువ జరిగింది. ఆయన తలపెట్టిన ప్రతి పనికిమ్ ఎదో ఒక అడ్డంకి వచ్చింది. దాదాపు అన్ని నిర్ణయాలు కూడా కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జిల్లాల విభజన కార్యక్రమం కూడా ఇప్పుడు వాయిదా పడేలా ఉంది. ఈ కార్యక్రమానికి ఒక రకంగా చూసుకుంటే టీడీపీ, బీజేపీల నుండి కూడా ఎలాంటి వ్యతిరేకత రావడం లేదు. అయినా కూడా ఈ కార్యక్రమం వరుసగా వాయిదా పడుతూనే ఉంది.
ఎందుకు వాయిదా పడింది??
జిల్లాల విభజన పాలన సౌకర్యం చేసినా కూడా అది ఒక రకమైన రాజకీయ ఎత్తుగడ. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ వాయిదా పడిందని వైసీపీ నాయకులే చెప్తున్నారు. దీనికి కారణం పార్లమెంటు స్థానాలను ఆధారం చేసుకుని ఏర్పాటు చేయాలని అనుకున్న జిల్లాలు.. 2026లో పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉండడంతో సంఖ్యపై ఒక గందరగోళం ఏర్పడింది. ఈ విషయంలో కేంద్రం నుంచి సమాచారం అందడం లేదు. ఇక, నిధుల పరంగా కొత్త జిల్లాలకు ఇబ్బందులు తప్పవు. అధికారుల సంఖ్య కూడా భారీగా కావాలి. ఇవన్నీ ఇలా ఉంటే..జిల్లాల కమిటీ చైర్మన్ గా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాహ్ని ఈ నెల ఆఖరులో పదవీ విరమణ చేయనున్నారు.
వచ్చే ఏడాదిలోనే
దీనికితోడు కరోనా కారణంగా జల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు. దీంతో వచ్చే ఏడాది డిసెంబరు నాటికి దీనిని వాయిదా వేయనున్నట్టు తెలు్స్తోంది. ఎందుకంటే.. స్థానిక ఎన్నికలతో మూడు నెలలు ఎలాగూ గడిచి పోతాయి. దీంతో జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడిందని తెలుస్తోంది. ఫైనల్‌గా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వచ్చే యేడాది అయినా జరుగుతుందా ? అన్న కొత్త సందేహం స్టార్ట్ అయ్యింది.