Lady Aghori: దేనికైనా ఒక హద్దు అదుపు ఉంటుంది ఆ హద్దులు దాటి శృతి మించితే ప్రతి ఒక్కటి కూడా వికారంగానే కనిపిస్తుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాలలో అఘోరి విషయం కూడా ఉందని చెప్పాలి . లేడీ అఘోరిగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఫేమస్ అయ్యారు ట్రాన్స్ జెండర్ శ్రీనివాస్. అయితే సనాతన ధర్మం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ఆలయాలను సందర్శిస్తూ సనాతన ధర్మం కోసం పోరాడుతున్న మహిళగా గుర్తింపు పొందారు. కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారు అప్పుడే ఈమె గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇలా మంగళగిరికి చెందిన శ్రీ వర్షిని అనే అమ్మాయిని ట్రాప్ చేసి తనని పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది అయితే ప్రస్తుతం ఓ మహిళ నిర్మాత ఫిర్యాదు మేరకు ఆ ఘోరీ జైలుకు వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇక తనని అరెస్టు చేసిన పోలీసులు అఘోరి గురించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.నెంబర్ ప్లేట్ లేకుండా కారులో ఎలా తిరుగుతున్నాడు? దీనివెనుక ఎవరున్నారు? ఆ కారు ఎవరిది? అనేదానిపై లోగుట్టు విప్పే పనిలో పడ్డారు పోలీసులు. అందులో ఊహించని నిజాలు బయటకు వచ్చాయి. లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ పేరు పేరిట కారు రిజిస్ట్రేషన్ అయ్యింది. కారు నెంబర్,TN19BU 6939.
అఘోరి వెనుక తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉందని తెలుస్తోంది.ఆ నాయకుడు అఘోరీకి ఐ20 కారుని గిఫ్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. అఘోరీకి ఆయన ఫండింగ్ చేస్తున్నాడా? అనేదానిపై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై తమిళనాడులోని ఆ నాయకుడితో ఫోన్లో మాట్లాడారట పోలీసులు. అఘోరీకి అండగా ఉండి తనను బయటకు తీసుకు రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తును చేపడుతున్నారు.