బీజేపీకి దూరమైతే పవన్ కళ్యాణ్ కు నష్టమేనా.. ?

గత కొన్నేళ్లుగా ఏపీలో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఏపీ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితులు అయితే లేవనే సంగతి తెలిసిందే. మరోవైపు జనసేన పార్టీని రాష్ట్రంలోని చాలామంది ప్రజలు ఒక రాజకీయ పార్టీగా గుర్తించడం లేదు.

బీజేపీ జనసేన కాకుండా టీడీపీ జనసేన కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితాలు మరో విధంగా ఉంటాయని జనసేన అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీకి దూరం అయితే జనసేన పార్టీకి నష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోయినా 2024లో కూడా కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. బీజేపీకి పవన్ దూరం కావాలని అనుకున్నా కారణం చెప్పడం తేలిక కాదనే సంగతి తెలిసిందే. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒక్క రాంగ్ స్టెప్ వేసినా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పై ఆ ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నా బీజేపీ నేతలు ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేరు. బీజేపీతో కలవడమే పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 2024 ఎన్నికల్లో పవన్ కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చూడాల్సి ఉంది.