2019 ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ పార్టీ, దాని నుండి తేరుకొని మెల్లమెల్లగా యాక్టీవ్ కావాలని చూస్తున్న కానీ, పార్టీలోని కొందరు నేతలు అందుకు సహకరించటం లేదని తెలుస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు కొద్దీ రోజులు పార్టీకి దూరమా ఉన్నకాని, గెలిచిన నేతలైన క్యాడర్ ను కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొనిపోవాలి, కానీ టీడీపీ లో అలాంటి వాళ్ళు పెద్దగా కనిపించటం లేదు. ఒకప్పుడు టీడీపీ కి కంచుకోటగా పేరుగాంచిన గుంటూరు లో ప్రస్తుతం పార్టీ పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తుంది.
ఈ జిల్లా నుండి కీలక నేతగా ఉంటున్న గల్లా జయదేవ్ పార్టీ పరంగా యాక్టీవ్ గా లేకపోవటంతో అక్కడ పార్టీ భవిష్యత్తు పై నీలినీడలు కమ్ముకున్నాయి. చంద్రబాబు రెండు రోజుల కిందట నిర్వహించిన కీలక నేతల టెలీ కాన్ఫరెన్స్‌లో కొందరు గుంటూరు నాయకులు ఎంపీ గల్లా జయదేవ్‌పై ఫిర్యాదులు చేశారు. ఆయన వ్యవహార శైలిపై విమర్శల బాణాలను సంధించారు. తమకు అందుబాటులో ఉండడంలేదని, నియోజకవర్గంలో ప్రజలకు కూడా అందుబాటులో లేరని.. ఎప్పుడు కార్యాలయానికి వస్తారో.. ఎప్పుడు వెళ్తారో.. కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని.. నేతలు ఒక్క పెట్టున విమర్శల పర్వం తెరిచారు.
ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల నోటి నుండి అలాంటి మాటలు రావటంతో బాబు షాక్ అయ్యాడు. గుంటూరు లో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నకాని, పుంజుకోవడం లేదు. ఒకరిద్దరు కీలక నేతలు మాత్రం ఇక్కడ హడావుడి చేయడం మమ అనిపించి ముగించేయడం తప్ప.. మనసుపెట్టి పనిచేయడం లేదనేది ప్రధాన విమర్శ. దీనివెనుక ఉన్న రీజనేంటని.. ఆరాతీస్తే.. అందరి వేళ్లూ.. ఎంపీ గల్లా జయదేవ్‌వైపే చూపించడం గమనార్హం. త ఏడాది ఎన్నికల్లోనూ ఎంపీ ఓటు తనకు వేయాలని, ఎమ్మెల్యే ఓటు ఎవరికి వేసుకున్నా అభ్యంతరం లేదని ఆయన ప్రచారం చేశారని.. ఇదే తమ కొంప ముంచిందని నాయకులు అప్పట్లోనే ఫిర్యాదులు చేశారు.
ఆ జిల్లాలో బలమైన నేతలు ఉన్నటువంటి ధూళిపాళ నరేంద్ర కుమార్ నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు వరకు ఎవరూ కూడా చంద్రబాబు ఆదేశాలను విని కూడా విననట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీలో ఒకవిధమైన నిరాశ చోటు చేసుకుంది. దానికి కారణం గల్లా జయదేవ్ అంటూ ఆ జిల్లా నేతలందరూ ఫిర్యాదు చేయటం జరిగింది. గతంలో పిర్యాదులు వచ్చిన సమయంలో మౌనంగా ఉన్న చంద్రబాబు మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి