Savitri: ఇలాంటి దుస్తులు ధరిస్తే మీరు కూడా ఈ టైపు అనే భావన కలుగుతుంది.. తీన్మార్ సావిత్రి పై నెటిజన్ షాకింగ్ కామెంట్!

Savitri: తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి అంటే పెద్దగా పరిచయం అవసరం లేదు. తీన్మార్ వార్తల ద్వారా ఈమె తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సావిత్రి అంటే అందరికీ ఒక అభిప్రాయం ఉంది. తీన్మార్ వార్తల ద్వారా అచ్చమైన తెలుగమ్మాయిగా చీరలో సాంప్రదాయం ఉట్టిపడేలా కనిపించే సావిత్రికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతో ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే దానికి సంబంధించిన ఎన్నో విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఎన్నో వీడియోలను షేర్ చేస్తున్న శివజ్యోతి కొన్నిసార్లు దారుణమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ఇందులో నలుపు రంగు డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొన్ని క్షణాలలో వైరల్ గా మారి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంది.

శివ జ్యోతి ధరించిన ఈ డ్రెస్ మెడ నుంచి ఎద భాగాల వరకు నెట్ మాదిరిగా ఉండి శరీరం మొత్తం కనిపించడంతో ఈ ఫోటో వైరల్ గా మారడమే కాకుండా దారుణమైన కామెంట్లను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ ఫోటో పై స్పందిస్తూ అక్క మీరు అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. కానీ ఇలాంటి దుస్తులు ధరించి మీ వ్యాల్యూ తీసుకోకండి. ఈ డ్రెస్ లో మిమ్మల్ని చూస్తుంటే మీరు కూడా ఈ టైప్ లే అనే భావన కలుగుతుంది అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుత ఈ ఫోటో వైరల్ గా మారింది.