ఆ విషయంలో సుమని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..అదే తగ్గించుకుంటే మంచిది అంటూ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో సుమ కనకాల కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న సుమ బుల్లితెర మీద మకుటం లేని మహారాణిగా గుర్తింపు పొందింది. ఇలా బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ సినిమా రిలీజ్ ఈవెంట్ లో కూడా సందడి చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఇంటర్వ్యూలతో నిత్యం బిజీగా ఉండే సుమ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

ఇలా యాంకర్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఇటీవల నటిగా కూడా తన సత్తా నిరూపించుకుంది. ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించిన సుమ తన నటనతో వెండితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇలా ఒకవైపు నటిగా మరొకవైపు యాంకర్ గా నిత్యం బిజీగా ఉండే సుమ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల సుమ సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించింది. ఆ ఛానల్ ద్వారా సుమ చేసే వీడియోలు కూడా నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే గత కొంత కాలంగా సుమ టీవి షోస్ లో ఎక్కువగా కనిపించటం లేదు.

ఈటీవిలో ప్రసారమవుతున్న క్యాష్ షో లో మాత్రమే సందడి చేస్తోంది. ఇక సినిమా ఈవెంట్ ల విషయానికి వస్తే..వరుస ఈవెంట్ లతో సుమ చాలా బిజిగా ఉంది. అందువల్లే టీవి షో లలో కూడ ఎక్కువగా కనిపించటం లేదు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా సుమ కొంత కాలంగా నెటిజన్స్ నుండి విమర్శలను ఎదుర్కుంటోంది .ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో కానీ టీవి షో లో కానీ సుమ ఈ మధ్య తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఓవరాక్షన్ చేస్తోంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది అంటూ కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.