మనసులో మాట చెప్పమన్న ఆశు.. దారుణమైన కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్…!

బిగ్ బాస్ ఫేమ్ ఆశు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు, టిక్ టాక్ వీడియోస్ ద్వారా బాగా పాపులర్ అయిన ఆశురెడ్డి జూనియర్ సమంతగా బాగ పాపులర్ అయ్యింది. దీంతో ఈమెకి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ బిగ్ బాస్ సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి బాగా పాపులర్ అయ్యింది. ఆ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత కూడా వీరిద్దరి గురించి చాలా వార్తలు వినిపించాయి.

ఎప్పుడు సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆశు రెడ్డి తన అందమైన ఫొటోలు, వీడియోలను సోషియల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలలో తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఇటీవల ఓటిటిలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఈ నాన్ స్టాప్ సీజన్ లో గ్రాండ్ ఫినాలే వరకు చేరుకోవాలని ఆశపడిన ఆశు రెడ్డి చివరకి ఎలిమినేట్ అయ్యింది. ఈ రియాలిటీ షోలలో కూడా ఆశు రెడ్డి డబుల్ మీనింగ్ డైలాగులు, అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆశు రెడ్డి ఇటీవల ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా.. అన్న అనుష్క డైలాగు చెప్పగా పక్కనే ఉన్న అజయ్ తలపై కొట్టాడు. ఈ వీడియో షేర్ చేస్తూ మీ మనసులో మాట చెప్పండీ అంటూ రాసుకొచ్చిందీ. నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. నీకోసం గుర్రాలు కాదు కదా గాడిదలు కూడా వేసుకొని రారు అని ఒక కామెంట్ పెట్టారు. ముందు స్నానం చెయ్ ఆ కంపు భరించలేకపోతున్నా అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. ఇలా తమ కామెంట్స్ తో ఆశుని ఒక ఆట ఆడుకుంటున్నారు.