Supritha: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాక్ డౌన్ సమయంలో నటి సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఎంతో అలరించారు. సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను,వీడియోలను షేర్ చేయడమే కాకుండా అభిమానులకు తన కూతురు సుప్రీతను కూడా పరిచయం చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సుప్రీతకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇలా సుప్రీత సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మకు అభిమానుల నుంచి ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురవడంతో సుప్రీత ఆ నెటిజెన్ ప్రశ్నకు దీటుగా సమాధానం చెప్పింది. సాధారణంగా ఒక వ్యక్తికి అబ్బాయిలు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఏర్పడటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే సుప్రీత ఫ్రెండ్స్ గ్యాంగ్లో నందు అనే అబ్బాయి నీకు ఏమవుతాడు అంటూ ప్రశ్నించారు.
నందు నీకు బాయ్ ఫ్రెండా? లేక బాయ్ లో బెస్టీనా? అని అడిగారు. ఇలా నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుప్రీత స్పందిస్తూ తన దైన శైలిలో సమాధానం చెప్పారు. అవును ఒక అమ్మాయికి తప్పనిసరిగా అలాంటి అబ్బాయి ఫ్రెండ్ గా ఉండాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్స్ మాదిరిగా ఉండలేరని చాలా మంది భావిస్తారు. కానీ మా ఈ విషయంలో ఎప్పటికీ అలా జరగదు. ఎవరు ఏమనుకున్నా మేమిప్పుడు మంచి స్నేహితులం అంటూ సుప్రీత తనదైన శైలిలో సమాధానం చెప్పారు.