Netflix : “నెట్ ఫ్లిక్స్” యూజర్స్ కి షాక్..బహుశా కారణం ఇదే కావచ్చని అంటున్నారు..!

Netflix : ప్రపంచంలో ప్రస్తుతం వెబ్ కంటెంట్ కి వీక్షకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలిసిందే. సినిమాలకు మించి ఎక్కువ థ్రిల్ మరియు బెస్ట్ నాణ్యతతో కూడిన కంటెంట్ ని ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో తీసుకొస్తూ ఉండడంతో ఇప్పుడు ప్రపంచం ఇలా మారింది. అయితే ఈ డిజిటల్ యుగంగా అగ్రగామి సంస్థగా ఉన్న  ఓటీటీ సంస్థ ఏదన్నా ఉంది అంటే అది “నెట్ ఫ్లిక్స్” అనే చెప్పాలి.
ప్రపంచంలోనే ఏ ఇతర ఓటిటి యాప్ లో ఉండని ఎక్కువ కంటెంట్ వీరి సొంతం. కాకపోతే కాస్త ధరలు ఎక్కువ ఉంటాయని టాక్ ఉన్నా తక్కువ నెట్ ఖర్చు తో స్ట్రీమింగ్ మాత్రం బాగా అందిస్తారని ఒక పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అయితే వీరికి ఉంది. మరి ఇప్పుడు వరకు అంతా బాగానే ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా మాత్రం ఇప్పుడు ఈ దిగ్గజ సంస్థ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇది వరకు వీరి నుంచి ఒకరు సబ్ స్క్రైబ్ అయితే వారు దాదాపు గా ఆ అకౌంట్ ని ఐదుగురుకి పంచుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ వెసులుబాటు కావాలి అంటే.. ఎలా అంటే ఆ ఒక్క వ్యక్తి తన పాస్ వర్డ్ ని ఇతరులకు షేర్ చెయ్యాలి అంటే అదనంగా మరింత చెల్లించాల్సి ఉంటుంది అట. ఒకవేళ చెయ్యకపోతే సేవలు ఆగిపోతాయని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.
అయితే ఊహించని రీతిలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉండి ఉండొచ్చని ఓటిటి నిపుణులు అంటున్నారు. గత కొన్ని వారాల కితం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల మినహా ఈ నెట్ ఫ్లిక్స్ కి ఉన్న అధిక రేట్లు కారణంగా దాదాపు 10 లక్షలకు పైగా యూజర్లు వెనక్కి వెళ్లిపోయారు.
దీనితో వీరికి ఊహించని విధంగా భారీ నష్టాలు వచ్చాయి. దీనితో వాటిని భర్తీ చెయ్యడానికి నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే వీరు ఇప్పుడు అందరి యూజర్స్ పై ఈ వేటు వేశారని వినికిడి. అలాగే ఆల్రెడీ కొందరు నెటిజన్లు తమకు ఈ అలర్ట్స్ వస్తున్నాయని కూడా అంటున్నారు.