నయనతార పెళ్లి ఖర్చంతా భరించిన నెట్ ఫ్లిక్స్.. కారణం అదేనా?

నయనతార విగ్నేష్ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట చివరికి జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. మొదట వీరి వివాహం తిరుపతిలో చేసుకోవాలని భావించిన పలు కారణాలవల్ల వివాహ వేదిక మహాబలిపురానికి మారింది. మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో ఈ జంట ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. వివాహం కోసం రిసార్ట్ ఎంతో అందంగా ముస్తాబు చేయడంతో పాటు వీరి పెళ్ళికి వివిధ రకాల భోజనాలతో పాటు అతిథుల కోసం ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయడం వంటి అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.

ఇలా ఎంతో ఘనంగా వీరి వివాహం చేసుకోవడంతో వీరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూస్తుంటేనే వీరి పెళ్లి కోసం భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి కోసం నయనతార విగ్నేష్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదని సమాచారం. వీరి పెళ్లి ఖర్చు మొత్తం నెట్ ఫ్లిక్స్ భరించిందని తెలుస్తోంది. నయనతార విగ్నేష్ పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరు పెళ్లి ఖర్చులు కూడా నెట్ ఫ్లిక్స్ భరించి నట్లు తెలుస్తోంది.

నయనతార పెళ్లి కోసం ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. మేకప్ ఆర్టిస్ట్ ల నుంచి సెక్యూరిటీ సిబ్బందిని ముంబై నుంచి తీసుకొచ్చారని ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఏ ఒక్క ఫోటో వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వీరి వివాహ వేడుకను గౌతమ్ మీనన్ దర్శక పర్యవేక్షణలో చిత్రీకరించారని సమాచారం. త్వరలోనే వీరి వివాహ వేడుక నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని తెలుస్తోంది.