నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ రివ్యూ

నటినటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిద్ధార్థ్  మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్, సంగీత, నిహారిక, ప్రమోదిని తదితరులు.

డైరెక్టర్: కార్తీక్ శంకర్

నిర్మాతలు: కోడి దివ్య దీప్తి

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి

ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తన సినిమాల మీద మినిమం ఎక్సపెక్టషన్స్ ఉండేలా చూసుకుంటున్న కిరణ్ ‘సమ్మతమే’ మూవీ తర్వాత ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మించారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

కిరణ్ అబ్బవరం కి చదువు అంతగా అబ్బదు. అలా చదువులో ఫెయిల్ అయ్యి ఖాళీగా తిరుగుతూ తాగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. కొన్నాళ్ళకు క్యాబ్ డ్రైవర్ గా జాబ్ లో జాయిన్ అవుతాడు. జీవితం లో ఎలాగైనా పైకి రావాలని కోరుకునే కిరణ్ కి ఒక శ్రీమంతుడి కూతురితో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు.

ఇంక ఆ అమ్మాయిని ఎలా అయినా పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిన కిరణ్  ఆ అమ్మాయి తండ్రితోనే గొడవకు దిగుతాడు. ఆ అమ్మాయిని ఎలా దక్కించుకుంటాడు.. తన తల్లితండ్రులను ఎలా ఒప్పిస్తాడు అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అంటే కిరణ్ అబ్బవరం నటన అని చెప్పవచ్చు. తన యాక్టింగ్ తో  ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడు కిరణ్. అయితే ఈ సినిమాలో బాబా భాస్కర్ నటన మాత్రంమరింత హైలెట్ గా నిలిచింది. మ్యూజిక్ కూడా పరవాలేదు. పంచ్ డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

మొత్తం గా సినిమా బాగున్నప్పటికీ అక్కడక్కడ నెమ్మదిగా సాగినట్లు అనిపించింది. కొంత ఎడిట్ చేసి ఉంటె ఇంకా బాగుండేది.

చివరి మాట:

ఈ సినిమా ప్రెసెంట్ జనరేషన్ కి  తప్పకుండా నచ్చుతుంది.  ముఖ్యంగా ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కొంచెం వెరైటీ గా ఉంటుంది.  అలాగే  డైలాగ్స్, మ్యూజిక్, మంచి యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చు.