దర్శకుడు : మోహన్ రాజా
నటీనటులు : మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాధ్, సత్యదేవ్, సునీల్, మురళీ శర్మ, సముద్రఖని, బ్రహ్మాజీ, తాన్య రవిచంద్రన్
నిర్మాతలు : రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి
సంగీతం : థమన్
ఒకప్పుడు మెగాస్టార్ గా మూడు దశాబ్దాలు ఏలిన చిరంజీవి ఆ తర్వాత పదేళ్లు గ్యాప్ తీసుకుని మళ్ళీ మెగాస్టార్ లా నిరూపించుకోవాలని తపన పడుతున్నాడు. కానీ ఆ రేంజ్ హిట్స్ మాత్రం రావడంలేదు. మొన్న వచ్చిన ‘ఆచార్య’ ఘోరంగా నిరాశపరిచింది. ఇప్పుడు ఆశలన్నీ ‘గాడ్ ఫాదర్’ మీదే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
ఒక పొలిటికల్ గాడ్ ఫాదర్ మరణం తర్వాత, రాజకీయ నాయకులుగా నటిస్తున్న అనేక మంది అధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి టైం లో కొందరు గాడ్ ఫాదర్ కి ఎంతో ఇష్టమైన బ్రహ్మ పేరు బయటకి వస్తుంది. అలాగే బ్రాహ్మణి గాడ్ ఫాదర్ కి వారసుడిగా కొందరు సిఫార్సు చేస్తారు. ఇది గాడ్ ఫాదర్ కూతురు సత్యప్రియ కి నచ్చదు. సత్యప్రియ బ్రహ్మను ద్వేషించడానికి కారణం మరియు పరిస్థితులు ఏమిటి? సత్యప్రియ, అలాగే ఆమె కుటుంబాన్ని కష్టాల నుండి బ్రహ్మ ఎలా కాపాడాడు? జైదేవ్ ఎవరు?…ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే:
ఈ సినిమాలో లార్జర్ దన్ లైఫ్ తరహా సినిమా తీయగల అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ దర్శకుడు చేసిన మార్పుల వల్ల పూర్తిగా దారి తప్పిపోయినట్లు కనిపిస్తోంది. మెగాస్టార్ ఇమేజ్ కోసం తెలుగులో చేసిన మార్పులు సినిమాలోని సోల్ ని చెడిగొట్టినట్టు అనిపిస్తుంది.
చిరంజీవి గ్రేట్ నటుడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ మధ్య చిరంజీవి నటన చాలా ఆర్టిఫిషల్ గా అనిపిస్తుంది. నయనతార ఎప్పటిలాగే అద్భుతంగా నటించింది. సత్యదేవ్ కూడా మరో సారి తన నటనతో ఆకట్టుకున్నాడు. సల్మాన్ ఖాన్ రోల్ తో పెద్ద ఉపయోగం లేదు.
ప్లస్ పాయింట్లు:
నయనతార, సత్యదేవ్
కొన్ని రాజకీయ సన్నివేశాలు
పోరాటాలు
మైనస్ పాయింట్లు:
సంగీతం, BGM
అనవసర బిల్డప్‌లు
ఓవరాల్ గా ‘గాడ్ ఫాదర్’ సినిమా గాడ్‌ఫాదర్ పాక్షికంగా ఆకట్టుకున్నాడు మరియు పాక్షికంగా నిరాశపరిచాడు. మాస్ ఆడియన్స్ కి కావలసిన అంశాలు ఉన్నాయి. చిరంజీవి ఫాన్స్ కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది.